కార్యకర్త కుటుంబానికి ఆర్థిక సహాయం
కార్యకర్త కుటుంబానికి ఆర్థిక సహాయం
కామేపల్లి, శోధన న్యూస్ : ఇటీవల పొన్నెకల్లు గ్రామంలోఅనారోగ్యంతో మృతి చెందిన పోలే పంగు వీరయ్య కుటుంబాన్ని పరామర్శించిన మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గింజల నరసింహారెడ్డి మరియు గ్రామ శాఖ నాయకులు ఈ సందర్భంగా వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి నీ వ్యక్తపరిచి, కాంగ్రెస్ పార్టీ అండదండలు ఎప్పటికీ ఉంటాయని, వారికి మనోధైర్యం కల్పించి, వారి కుటుంబానికి అన్నివేళలా సహాయ సహకారాలు అందిస్తామని, ఈ సందర్భంగా వారికి మనోధైర్యం కల్పించారు.అనంతరం గ్రామ శాఖ తరపున రూ10,000 రూపాయల ఆర్థిక సాయం కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గింజల నరసింహారెడ్డి, నాయకులు నగండ్ల వెంకటేశ్వరరావు, యూత్ కాంగ్రెస్ నాయకులు వల్లభనేని అశోక్, పంచాయతీ పాలకమండలి సభ్యులు శిలా సాగరపు నాగేశ్వరరావు, కుర్ర శ్రీకాంత్, దండుగుల నాగయ్య, బంక నాగేశ్వరరావు, మాతంగి భాను, దైద ప్రేమ్ కుమార్, మాల పోలు లింగరాజు, దాసరి మధు కుమార్ సిరిపంగి శంకర్ తదితరులు పాల్గొన్నారు.