ఖమ్మంతెలంగాణ

కార్యదర్శులు అందుబాటులో ఉండాలి…

కార్యదర్శులు అందుబాటులో ఉండాలి
-కారేపల్లి  ఎంపీడీవో చంద్రశేఖర్
కారేపల్లి, శోధన న్యూస్: వాతావరణ శాఖ సూచనల మేరకు రాబోయే మూడు రోజుల వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నందున పంచాయతీ కార్యదర్శులు అందరూ అందుబాటులోనే ఉండాలని ఖమ్మం జిల్లా కారేపల్లి  ఎంపీడీవో ఎం చంద్ర శేఖర్ ఆదేశించారు. మంగళవారం స్థానిక మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ ప్రజలు ఎవ్వరు లోతట్టు ప్రాంతాలకు వెళ్లకూడదని, పిడుగులు పడే అవకాశం ఉన్నందున చెట్ల కింద ఉండకూడదని అన్నారు. దేవాలయాలలో ఉండే మైకుల ద్వారా, గ్రామపంచాయతీ ట్రాక్టర్ ద్వారా ఈ విషయమై విస్తృత ప్రచారం చేసి ప్రజలను అప్రమత్తం చేయాలని ఆయన కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *