కిస్నా డైమండ్ అండ్ గోల్డ్ జ్యువెలరీ ప్రారంభం
కిస్నా డైమండ్ అండ్ గోల్డ్ జ్యువెలరీ ప్రారంభం
హైదరాబాద్, శోధన న్యూస్: హైదరాబాద్ నగరంలో కిస్నా డైమండ్ అండ్ గోల్డ్ జ్యువెలరీ సంస్థ తమ బ్రాండ్ షోరూంను ఆవిష్కరించింది. ఆదివారం నిర్వహించిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో సంస్థ ఎండీ ఘనశ్యామ్ ధోలాకియా మాట్లాడుతూ నగరంలో ఇది తమ రెండో బ్రాండ్ షోరూం అన్నారు. దేశవ్యాప్తంగా నూతనంగా ప్రారంభించిన దానితో కలిపి 13 షోరూంలు ఉన్నాయన్నారు. ముత్యాల నగరంగా పేరుగాంచిన హైదరాబాద్ లో గత 18 సంవత్సరాల నుంచి తాము సేవలందిస్తున్నామని తెలిపారు. హరి కృష్ణ గ్రూప్ పేరిట వ్యాపార లావాదేవీలు జరుగుతున్నాయన్నారు. నాణ్యత, నైపుణ్యం, వినియోగదారుల సంతృప్తికి తాము అత్యధిక ప్రాధాన్యం ఇస్తామన్నారు. తమ నిబద్ధత, విశ్వసనీయత ఆభరణలా పరిశ్రమలో తమను ప్రసిద్ధి గాంచేలా చేసిందని వివరించారు. అనంతరం సంస్థ డైరెక్టర్ పరాగ్ షా మాట్లాడుతూ ఇనార్బిట్ మాల్ తో తమ నూతన బ్రాండ్ షోరూం తెరిచామన్నారు. అన్ని సందర్భాలకు అనుగుణమైన వజ్రాభరణాలు, బంగారు ఆభరణాలు వినియోగదారులు ఎంపిక చేసుకోవచ్చ న్నారు. భవిష్యత్తులో తమ సేవలను మరిన్ని ప్రాంతాలకు విస్తరిస్తామని తెలిపారు.