కేంద్ర మంత్రి పర్యటనను విజయవంతం చేయండి
కేంద్ర మంత్రి పర్యటనను విజయవంతం చేయండి
-బిజెపి జిల్లా అధ్యక్షులు సత్యనారాయణ
, శోధన న్యూస్:
ఈ నెల 19వ తేదీన మధిర లో కేంద్ర సామాజిక న్యాయ శాఖ మంత్రి ఏ నారాయణ పర్యటన ను విజయవంతం చేయాలని బిజెపి జిల్లా అధ్యక్షులు గల్లా సత్యనారాయణ స్వామి పిలుపునిచ్చారు.
మధిర పట్టణంలోని బిజెపి కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ… కేంద్ర మంత్రి పర్యటనలో ఆంధ్రప్రదేశ్ సంఘటన ప్రధాన కార్యదర్శి, మధుకర్ జి లు పాల్గొంటారని తెలిపారు. ఈ పర్యటనలో బూత్ కమిటీ అధ్యక్షులు ముఖ్య నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని విజవంతం చెయాలని విజ్ఞప్తి చేశారు.
ఈ సమావేశంలో బీజేపీ మధిర అసెంబ్లీ కన్వీనర్ ఏలూరి నాగేశ్వరరావు, దళిత మోర్చా రాష్ట్ర కార్యదర్శి పెరుమాళ్ళపల్లి విజయరాజు, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్యామ్ రాదోడ్, బీజేపీ జిల్లా కార్యదర్శి చిలువేరు సాంబశివరావు, జిల్లా అధికారప్రతినిధి రామిశెట్టి నాగేశ్వరరావు, పట్టణ అధ్యక్షులు పాపట్ల రమేష్, జిల్లా కార్యవర్గ సభ్యులు కుంచం కృష్ణారావు, దళిత మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి దేవరకొండ కోటేశ్వరరావు, ఉపాధ్యక్షులు తాళ్లూరి సురేష్, మాన్ కి బాత్ అసెంబ్లీ కోర్డినేటర్ రామయోగేశ్వరరావు, పట్టణ ప్రధాన కార్యదర్శి బియ్యవరపు రామకృష్ణ, చింతకాని యువమోర్చ అధ్యక్షులు కొండా గోపి, రాము, సుమంత్, రవిచంద్ తదితరులు పాల్గొన్నారు.