కేసులకు సంబంధించిన నగదు విడుదల చేసిన జిల్లా ఎన్నికల అధికారి
కేసులకు సంబంధించిన నగదు విడుదల చేసిన జిల్లా ఎన్నికల అధికారి
భద్రాద్రి కొత్తగూడెం, శోధన న్యూస్: తనిఖీలలో పట్టుబడిన 109 కేసులకు సంబంధించి రెండు కోట్ల 45 లక్షల 76 వేల రూపాయల్లో 2 కోట్ల 15 లక్షల 62 వేల 860 రూపాయలు విడుదల చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి ప్రియాంక అల ఒక ప్రకటనలో తెలిపారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో భాగంగా ఇప్పటివరకు 2 కోట్ల 45 లక్షల 76 వేల రూపాయలు నగదు పట్టుకున్నట్లు తెలిపారు. పట్టుకున్న నగదుకు సంబంధించి సంబంధిత వ్యక్తులు సమర్పించిన ఆధారాలను తనిఖీ చేసిన జిల్లా గ్రీవెన్స్ కమిటి, 2 కోట్ల 15 లక్షల 62 వేల నగదును విడుదల చేసినట్లు తెలిపారు.
ఎన్నికల కోడ్ ఉల్లంఘనలపై వచ్చే ఫిర్యాదులకు ఎప్పటి కప్పుడు స్పందిస్తు తగు చర్యలు తీసుకుంటున్నామని పట్టుకున్న సమయంలో ఇచ్చిన రసీదు, తగిన ఆధారాలతో ఐడిఓసి కార్యాలయంలోని గ్రీవెన్స్ కమిటికి దరఖాస్తు చేసుకోవాలని ఆమె సూచించారు. ఎన్నికల్లో అక్రమాలపై సీ-విజిల్ యాప్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చన్నారు. ఓటర్లను ప్రలోభపెట్టే చర్యలు, డబ్బులు ఆశ చూపడం, మద్యం సరఫరా చేయడం, నేరపూరిత చర్యలకు పాల్పడినా, ఎన్నికల ప్రవర్తన నియమావళికి విరుద్ధంగా ప్రచారం చేసినా ఫొటోలు, వీడియోలు తీసి ఈ యాప్ లో ఫిర్యాదు చేయొచ్చున్నారు. సి విజిల్, 1050 ఇఅంట్రోల్ రూములకు వచ్చిన ఫిర్యాదులను జిల్లాలోని కమాండ్ కంట్రోల్ రూం సిబ్బంది ఎప్పటి కప్పుడు పరిష్కరిస్తారని చెప్పారు. వచ్చిన ఫిర్యాదులపై చర్యలు తీసుకోకపోతే అధికారులు బాధ్యులవుతారని ఆమె పేర్కొన్నారు. ఓటుహక్కు వినియోగంపై కళాశాలల్లో అవగాహన కార్యక్రమాలు ఏర్పాటుతో పాటు సెల్ఫీ పాయింట్లు ఏర్పాటు చేయాలని తెలిపారు. మున్సిపాలిటీల్లోని ప్రధాన కూడల్లులో ఫ్లెక్సీ లు ఏర్పాటు చేయాలన్నారు. స్వీప్ కార్యక్రమాలు పెద్ద ఎత్తున జరగాలని, పోలింగ్ తక్కువ జరిగిన పోలింగ్ కేంద్రాల్లో ఓటు హక్కు వినియోగంపై కళాజాత కార్యక్రమాలు ద్వారా విస్తృత ప్రచారం చేయాలని డిపిఆర్వో ను ఆదేశించారు. షాపింగ్ మాల్స్ వద్ద సెల్ఫీ పాయింట్స్ ఏర్పాటు చేపించాలని స్వీప్ నోడల్ అధికారిని ఆదేశించారు.