కొండంత భరోసాగా బిఆర్ఎస్ మేనిఫెస్టో-ప్రభుత్వ విప్ రేగా
ప్రజలకు కొండంత భరోసాగా బిఆర్ఎస్ మేనిఫెస్టో
- ఇంటింటికి సంక్షేమ పథకాలు అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ
- 13 న కేసీఆర్ప్ర జా ఆశీర్వాద సభను విజయవంతం చేయాలి
- ప్రభుత్వ విప్ రేగా కాంతారావు
కరకగూడెం, శోధన న్యూస్ : ప్రజలకు కొండంత భరోసాగా తెలంగాణ సీఎం కెసిఆర్ బిఆర్ఎస్ మేనిఫెస్టో ప్రకటించారని ప్రభుత్వ విప్, బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం లోని ముత్తారం, కొత్తగూడెం, గొల్లగూడెం, శ్రీరంగాపురం, కొత్తూరు, తుమ్మలగూడెం, పద్మాపురం, చోప్పాల , మొగిలితోగు, అనంతరం, గ్రామాలలో ఆయన విస్తృతంగా పర్యటించి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి తిరుగుతూ కారు గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని ఆయన కోరారు. గ్రామాలలో ఆయనకు మహిళలు మంగళ హారతులతో ఘన స్వాగతం పలికారు. గ్రామంలోని వనదేవతలను దర్శించుకుని ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ .. తనను మూడోసారి ఆశీర్వదిస్తే పినపాక నియోజకవర్గం అన్ని రంగాలలో అభివృద్ధి చేసి ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా నియోజకవర్గాన్ని వేల కోట్లతో అన్ని రంగాలలో అభివృద్ధి చేసినట్లు తెలిపారు. ఈనెల 13వ తేదీన బూర్గంపాడు మండలం లక్ష్మీపురం గ్రామంలో జరగనున్న సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభకు ప్రజాప్రతినిధులు, నాయకులు, పార్టీ శ్రేణులు ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందించిన ఘనత సీఎం కేసీఆర్ కే దక్కిందన్నారు. ప్రతి ఇంటికి పథకాలు అందాయన్నారు. సీఎం కేసీఆర్ ప్రకటించిన బిఆర్ఎస్ నూతన మ్యానిఫెస్టో తో ప్రజలకు ఎంతో మేలు జరుతుందని ఆయన అన్నారు. మూడోసారి బిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాగానే సంక్షేమ పథకాల అమలులో చరిత్ర సృష్టిస్తుందన్నారు. పినపాక నియోజకవర్గం లో జరిగిన అభివృద్ధిని చూసి బిఆర్ఎస్ కే పట్టం కట్టాలని కోరారు. రాష్ట్ర ఏర్పడ్డాక సీఎం కేసీఆర్ పాలనలో అభివృద్ధిలో దూసుకు వెళ్తుందన్నారు. సీఎం కేసీఆర్ సారధ్యంలో బిఆర్ఎస్ ప్రభుత్వం గ్రామీణ ప్రాంత పేద ప్రజలకు అనేక పథకాలు ప్రవేశపెట్టిందన్నారు. ప్రస్తుతం రైతులకు ఎకరానికి 10000 ఇస్తుండగా వాటిని 16 వేలకు పెంచినట్లు తెలిపారు. కళ్యాణ లక్ష్మి పథకం కింద రెండు లక్షలు గ్యాస్ సిలిండర్ 400 కి ఇస్తామని సీఎం కేసీఆర్ గారు ప్రకటించినట్లు తెలిపారు. సౌభాగ్య లక్ష్మి పథకం కింద ప్రతి పేద మహిళలకు 3 వేలు దివ్యాంగులకు 6 వేలు చెల్లిస్తామన్నారు పేదలకు తెల్ల రేషన్ కార్డు ద్వారా దొడ్డు బియ్యానికి బదులు సన్నబియ్యం అందిస్తామని తెలిపారు. ప్రతి కుటుంబానికి 5 లక్షల బీమా పథకం కల్పిస్తున్నట్లు తెలిపారు. దేశంలోనే ఎక్కడలేని విధంగా రైతులకు రైతుబంధు 24 గంటల విద్యుత్ అందిస్తున్న రాష్ట్రాలు లేవన్నారు. ఒక తెలంగాణలోనే సీఎం కేసీఆర్ గారు ఈ పథకాలు అమలు చేస్తున్నారని తెలిపారు. కులవృత్తులను బలోపేతం చేసి వారు ఆర్థికంగా బలోపేతం కోసం సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారు. ఈ కార్యక్రమం లో బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.