కోట మైసమ్మ అమ్మవారికి హారం బహూకరణ
కోట మైసమ్మ అమ్మవారికి హారం బహూకరణ
కారేపల్లి, శోధన న్యూస్ : మండల పరిధిలోని ఉసిరికాయలపల్లి గ్రామంలో కొలువై ఉన్న కోటమైసమ్మ అమ్మవారికి గురువారం
రూ.1,02,500ల విలువగల కంఠహారాన్ని భక్తులు విరాళంగా అందజేశారు.గురువారం మహబూబాబాద్ జిల్లా ములకనూరు గ్రామానికి చెందిన కడియాల భారతి కి అమెరికాలో ఉద్యోగం రావడంతో కంట హారాన్ని అందించి తమ ముక్కులను చెల్లించుకున్నారు.ఆలయ ట్రస్ట్ చైర్మన్ పర్సా పట్టాభి రామారావు, కార్యనిర్వహణ అధికారి కొండకింది వేణుగోపాలచార్యులు దాతలకు ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు అందజేశారు.ఈ సందర్భంగా భక్తులు మాట్లాడుతూ అమ్మవారిని కొలిచిన వారికి తమ కోరికలు తీరుతాయి అనడానికి తార్కానంగా ఉన్నామన్నారు.ట్రస్ట్ చైర్మన్ పర్సా పట్టాభి రామారావు మాట్లాడుతూ నమ్మి కొలిచిన వారికి కొంగుబంగారంలో కోట మైసమ్మ అమ్మవారు ఎల్లవేళలా తోడు ఉంటుందని,ఈ విషయం మరొకసారి రుజువైందన్నారు.ఈ కార్యక్రమంలో కోటేశ్వరావు,అర్చకులు కొత్తలంక కైలాష్ శర్మ, సిబ్బంది మూడ్ మోహన్, లలిత్ సాయి తదితరులు పాల్గొన్నారు.