కోరం కనకయ్య గెలుపే లక్ష్యంగా ఎన్నికల ప్రచారం
కోరం కనకయ్య గెలుపే లక్ష్యంగా ఎన్నికల ప్రచారం
ఇల్లందు, శోధన న్యూస్ : సిపిఐ, టిడిపి, జన సమితి వైఎస్ఆర్ టిపి బలపరిచిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కనకయ్య కి ఓటు వేసి గెలిపించాలని ఇల్లందు మున్సిపల్ చైర్మన్ దమ్మలపాటి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో బుధవారం ప్రచారం నిర్వహించారు. అర్హులైన ప్రతి ఇంటికి 6 గ్యారంటీలు గ్యారెంటీ అనే నినాదంతో కాంగ్రెస్ పార్టీ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ప్రచారాలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగానే నేడు ఇల్లందు మున్సిపాలిటీ పరిధిలోని 24,23 వార్డుల లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కనకయ్య గెలుపే లక్ష్యంగా ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ నాయకులు టిడిపి పట్టణ నాయకులు మున్సిపల్ కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.