కోరం విజయాన్ని కాంక్షిస్తూ మాజీ కేంద్ర మంత్రి బలరాం నాయక్ ప్రచారం
కోరం విజయాన్ని కాంక్షిస్తూ మాజీ కేంద్ర మంత్రి బలరాం నాయక్ ప్రచారం
ఇల్లందు, శోధన న్యూస్ : కాంగ్రెస్ అభ్యర్థి కోరం కనకయ్య విజయాన్ని కాంక్షిస్తూ శుక్రవారం ఇల్లందు పట్టణంలో మున్సిపల్ చైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వరరావు తో కలిసి మాజీ కేంద్రమంత్రి పోరిక బలరాం నాయక్ విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా సోనియాగాంధీ ప్రవేశపెట్టిన ఆరు గ్యారెంటీ పథకాల బ్రోచర్లు గడపగడపకు అందజేస్తూ హస్తం గుర్తుకు ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. డిసెంబర్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడబోతుందని ఆశ బావం వ్యక్తం చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏజెన్సీలో అటవీహాక్కుల చట్టాన్ని అమలు చేసి ప్రతి గిరిజన రైతుకు పోడుపట్ట అందజేసిందని, ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ చేసిందని గుర్తు చేశారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రవేశపెట్టిన మేనిఫెస్టో ప్రజల జీవితాలలో వెలుగులు నింపుతుందని అన్నారు. ప్రజలు ఆలోచించి తగు నిర్ణయం తీసుకోవాలని కోరారు. ప్రజలను పట్టిపీడిస్తున్న టిఆర్ఎస్ పార్టీని చిత్తుచిత్తుగా ఓడించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఇల్లందు ఇన్చార్జి మువ్వ విజయబాబు పట్టణ కాంగ్రెస్ నాయకులు జానీ,సత్యనారాయణ కార్యకర్తలు పాల్గొన్నారు.