ఖమ్మంతెలంగాణ

క్రిస్ట్ మస్ కు ముస్తాబైన చర్చీలు

క్రిస్ట్ మస్ కు ముస్తాబైన చర్చీలు

మధిర, శోధన న్యూస్ : క్రీస్తు జయంతి సందర్భంగా క్రైస్తవులు పలు చర్చిలకి రంగులు వేసి విద్యుత్ దీపాలతో అలంకరించారు. ఏసుక్రీస్తు జన్మదినమైన డిసెంబరు 25న క్రైస్తవ సోదరులు ప్రపంచవ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తారు. అంతేకాకుండా ఏసుక్రీస్తు అర్ధరాత్రి పశువుల పాకలో జన్మించినందున ప్రతి చర్చి ముందు పశువుల పాకను ఏర్పాటు చేసి ఏసుక్రీస్తు పుట్టుకకు సంబంధించిన చిత్రాలను ఏర్పాటు చేశారు. ఏసుక్రీస్తు పుట్టినప్పుడు నక్షత్రం కనిపించింది. దీనికి గుర్తుగా క్రైస్తవ సోదరులు తమ తమ నివాసాలపై విద్యుత్ లైట్లతో క్రిస్మస్ ట్రీ ని, స్టార్ ను ఏర్పాటు చేసుకొని పండుగ ఉత్సవాలను ప్రారంభించారు. మధిర పట్టణంలోని సిద్ధారెడ్డి రోడ్డులో అంబటి ఆశీర్వాదం సంధ్యారాణి నివాసంలో విద్యుత్ కాంతులతో ఏర్పాటు చేసిన క్రిస్మస్ ట్రీ అందర్నీ ఆకట్టుకుంది. క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని క్రైస్తవ సోదరులందరూ నూతన దుస్తులను ధరిస్తారు. దీంతో గత వారం రోజుల నుండి బట్టల షాపులు క్రైస్తవులతో కిటకిటలాడుతున్నాయి. ఏసుక్రీస్తు అర్ధరాత్రి జన్మించడంతో ప్రతి చర్చిలో డిసెంబరు 24 అర్ధరాత్రి ప్రత్యేక ప్రార్థనలు ఏర్పాటు చేసుకొని ఏసుక్రీస్తు యొక్క బోధనలను చర్చి ఫాదర్లు పాస్టర్లు ప్రజలకు వాక్యోపదేశం చేస్తారు. పట్టణంలోని ఆర్సిఎం చర్చి, సిఎస్ఐ చర్చి, తెలుగు బాప్టిస్ట్ చర్చి, హోసన్నా, క్రీస్తు సంఘం, పెంతుకోస్తు, హెబ్రోను తదితర సంఘాల ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. మండలంలోని బయ్యారం రోమన్ క్యాథలిక్ మిషనరీ కి చెందిన చర్చిలో జరిగే ప్రత్యేక ప్రార్థనల్లో ప్రతి సంవత్సరం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క నందిని దంపతుల పాల్గొని క్రైస్తవ సోదరులకు శుభాకాంక్షలు చెప్పటం 15 సంవత్సరాలుగా కొనసాగుతుంది. అదేవిధంగా పలు గ్రామాల్లో ఉన్న చర్చీల్లో జరిగే ప్రత్యేక ప్రార్థనల్లో ఆయా గ్రామాల్లో ఉన్న ముఖ్యమైన నాయకులు పాల్గొని క్రీస్తు జయంతి సందర్భంగా కేకులు కట్ చేసి క్రైస్తవులకు క్రిస్మస్ శుభాకాంక్షలు చెబుతారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *