ఖమ్మం పోలీస్ కమిషనర్ ను కలిసిన ఏరియా జిఎం..
ఖమ్మం పోలీస్ కమిషనర్ ను కలిసిన ఏరియా జిఎం
కారేపల్లి , శోధన న్యూస్ : సింగరేణి సంస్థ ఆస్తుల పరిరక్షణ సహకరించాలని ఖమ్మం పోలీస్ కమిషనర్ ఎస్ విష్ణు వారియర్ ను సింగరేణి సంస్థ జిఎం జాన్ ఆనంద్ కోరారు. మంగళవారం ఇల్లందు ఏరియా జనరల్ మేనేజర్ జాన్ ఆనంద్ ఖమ్మం పోలీస్ కమిషనర్ విష్ణు వారియర్ ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించి శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా వారు ఖమ్మం కమిషనరేట్ పరిధిలోని ఉసిరికాయలపల్లిలో గల సోలార్ ప్లాంట్ గురించి వారికి వివరించారు.అదేవిధంగా సింగరేణి సంస్థ యొక్క ఆస్తుల పరిరక్షణకు తమ సహాయ సహకారాలు అందించాలని విన్నవించారు.దీనికి పోలీస్ కమిషనర్ సానుకూలంగా స్పందిస్తూ సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.ఈ కార్యక్రమంలో సెక్యూరిటీ అధికారి అంజిరెడ్డి, ఇంటిలిజెన్స్ గార్డ్ సాంబయ్య, కమ్యూనికేషన్సమాన కోఆర్డినేటర్ కిశోర్ తదితరులు పాల్గొన్నారు.