గడపగడపకు బీఆర్ ఎస్ ప్రచార పోస్టర్లు ఆవిష్కరణ
గడపగడపకు బీఆర్ ఎస్ ప్రచార పోస్టర్లు
అశ్వాపురం, శోధన న్యూస్: ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు విజయాన్ని కాంక్షిస్తూ మండల పరిధిలోని చింతిర్యాల కాలనీ గ్రామపంచాయతీలో మంగళవారం గడపగడపకు ప్రచారాన్ని నిర్వహించారు. ప్రచార కార్యక్రమం సందర్భంగా పినపాక నియోజకవర్గం ఎస్సీ సెల్ అధ్యక్షులు ఎన్న అశోక్ కుమార్ ప్రచార పోస్టర్లను ఆవిష్కరించారు .ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పినపాక నియోజకవర్గం నుండి రేగా కాంతారావు విజయాన్ని సాధించేందుకు ప్రతి కార్యకర్త కృషి చేయాలని కోరారు. ప్రభుత్వం ప్రవేశపెట్టి అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించి రేగా గెలుపు కోసం కృషి చేయాలన్నారు..
ఈ కార్యక్రమంలో నాయకులు కొండా బాబురావు, వల్లెపోగు రాము, బిట్ర సంతోషరావు, జెట్టి సాంబాయ్య,యువజన నాయకులు బాబురావు, గుర్రం సాయితేజ, రావులపల్లి సాయి, దిలీప్, శభాష్టీన్, మహిళలు తదితరులు పాల్గొన్నారు.