గాయత్రి ఆశ్రమంలో సామూహిక అక్షరాభ్యాసాలు
గాయత్రి ఆశ్రమంలో సామూహిక అక్షరాభ్యాసాలు
దమ్మపేట,శోధన న్యూస్: విజయదశమి పర్వ దినాన్ని పురస్కరించుకొని పట్టణ పరిధిలోని గాయత్రి ఆశ్రమంలో శ్రీదేవి శరన్నవరాత్రి వేడుకలలో భాగంగా అమ్మవారిని సరస్వతి దేవి అలంకారంలో శుక్రవారం సర్వాంగ సుందరంగా అలంకరించారు. ఈ సందర్భంగా ఆశ్రమ వ్యవస్థాపకులు ప్రేమ్ సుస్థిర్ మూర్తిజి ఆధ్వర్యంలో చిన్నారులకు సామూహిక అక్షరాభ్యాసాలు నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారికి కలువ పూలతో ప్రత్యేక పూజలు అర్చన గాయత్రీ హోమాలు అనంతరం భక్తులకు అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు.