గిరిజనుల పక్షాన పోరాడే సీపీఎం అభ్యర్థిని గెలిపించాలని ప్రచారం
గిరిజనుల పక్షాన పోరాడే సీపీఎం అభ్యర్థిని గెలిపించాలని ప్రచారం
కారేపల్లి, శోధన న్యూస్ : నిత్యం గిరిజనులకు అండగా ఉంటూ వారి సమస్యల కోసం ప్రభుత్వాలపై పోరాడుతూ ఎన్నో గిరిజనుల సమస్యల పరిష్కారంలో ముఖ్యపాత్ర పోషించిన సీపీఎం పార్టీ అభ్యర్థి భూక్య వీరభద్రం సుత్తి కొడవలి నక్షత్రం గుర్తుపై ఓటు వేసి గెలిపించాల్సిందిగా సిపిఎం రాష్ట్ర నాయకులు మూడ్ శోభన్ కోరారు. బుధవారం సింగరేణి మండల పరిధిలోని బాజుమల్లయ్యగూడెంలో ఎన్నికల ప్రచారం చేశారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు మద్దెల నాగయ్య,యనమన గండ్ల రవి,కొండం వెంకటేశ్వర్లు, మాలోత్ రామకోటి,వల్లే బోయిన కొండలరావు, రాచర్ల విజయ్,రణధీర్, చిన్న సైదులు,బుక్య శ్రీను తదితరులు పాల్గొన్నారు.