ఖమ్మంతెలంగాణ

 గుమ్మడి అనురాధ ను  గెలిపించండి -మాజీ ఎమ్మెల్యే గుమ్మడి

   గుమ్మడి అనురాధ ను  గెలిపించండి

-మాజీ ఎమ్మెల్యే గుమ్మడి

కామేపల్లి, శోధన న్యూస్ : ఇల్లందు నియోజకవర్గంలో ఈనెల 30న జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో నీతిగా నిజాయితీ గల వ్యక్తి ఉన్నత విద్యావంతురాలైన గుమ్మడి అనురాధను  గెలిపించాలని ప్రజా పంధా రాష్ట్ర నాయకులు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య పిలుపునిచ్చారు. గుమ్మడి అనురాధ విజయాన్ని కాంక్షిస్తూ మండలంలో విస్తృత పర్యటన లో భాగంగా  మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య, స్వతంత్ర అభ్యర్థి అనురాధ ప్రజా పంధా నాయకులు మండలంలో విస్తృత పర్యటన చేశారు .లింగాల క్రాస్ రోడ్ ,ముచ్చర్ల ,ముచ్చర్ల క్రాస్ రోడ్ మద్దులపల్లి ,లాల్య తండా కామేపల్లి, ఊటుకూరు , తదితర గ్రామాలలో ఆదివారం ఓటర్లను కలిసి ఓటు అభ్యర్థించారు .మండల కేంద్రంలో  విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ… ఇల్లెందుని మూడు ముక్కలు చేసి మూడు జిల్లాల్లో కలిపి ప్రజలను ఇబ్బంది చేశారని, అభివృద్ధి ఆగిపోయిందని, రెవిన్యూ డివిజన్ సాధించటం కోసం కొమరారం బోడు మండలాల కోసం పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసిన ఎమ్మెల్యేలు స్పందించలేదని,సీతా రామ ప్రాజెక్ట్ నీళ్లు రాకుండా వేరే ప్రాంతాలు తరలిపోతున్న ,పోటీలో ఉన్న ప్రధాన పార్టీ వ్యక్తులు స్పందించలేదని, బయ్యారం ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు బాధ్యత తీసుకోలేదని వారు విమర్శించారు. పోడు భూములకు సంపూర్ణ  పట్టలు ఇంతవరకు ఇవ్వలేదని అన్నారు. విద్యార్థి దశ నుంచే ఉద్యమాలలో పాల్గొని ప్రొఫెసర్ గా పనిచేస్తూ ప్రజాసేవ చేయాలని ప్రజల ముందుకు వచ్చిందని ఆయన అన్నారు. అవినీతి అరాచక పాలన డబ్బు మద్యం అర్ధబలం కలిగిన వారిని ఓడించాలని నీతి నిజాయితీ కలిగిన అనురాధ ని గెలిపించాలని ఆయన కోరారు. ఆమె గుర్తు అయిన ఎయిర్ కండిషనర్ ఏసి గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు . ఈకార్యక్రమంలో స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థి గుమ్మడి అనురాధ,ప్రజాపంథా రాష్ట్ర నాయకులు ఆవుల అశోక్, ప్రజా పంధా నాయకులు గుమ్మడి సందీప్, రాకేష్ ,తేజ, పిడిఎస్ యూ  నాయకులు ఆజాద్, వెంకటేష్ ,ప్రజా పంధా నాయకులు సరోజిని,అనసూర్య,వీరన్న,భాస్కర్ పాపారావు,నాగేశ్వరరావు,శ్రీను పవిత్ర,చైతన్య,కరుణ్ ,ప్రియాంక తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *