గురుకులపాఠశాల, కళాశాలలో ప్రవేశాలకు దరఖాస్తులు చేసుకోండి
గురుకులపాఠశాల, కళాశాలలో ప్రవేశాలకు దరఖాస్తులు చేసుకోండి
అశ్వారావుపేట , శోధన న్యూస్ : నియోజకవర్గ కేంద్రంలోని మైనారిటీ గురుకుల బాలికల పాఠశాల, కళాశాలలో ప్రవేశాలకు దరఖాస్తులు చేసుకోవాలని ప్రిన్సిపల్ సంగీత తెలిపారు. ఐదవ తరగతి బ్యాక్ లాగ్, 6, 7, 8 తరగతులు ఇంటర్ ప్రథమ సంవత్సరం బైపిసి ఎంపీసీలలో ప్రవేశాలకు దరఖాస్తులు 2023- 24 విద్యా సంవత్సరానికి గాను ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. అర్హులైన విద్యార్థులు కళాశాలలో సంప్రదించాలని ప్రిన్సిపల్ సూచించారు. అలాగే ఎంసెట్, జేఈఈ మెయిన్స్, నీట్ లలో శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని మైనార్టీ విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ప్రిన్సిపాల్ సూచించారు.