ఘనంగా కోమరం భీమ్ వర్ధంతి
ఘనంగా కోమరం భీమ్ వర్ధంతి
పినపాక, శోధన న్యూస్ : ఆదివాసీ ల అస్థిత్వం కోసం నిరంతరం పోరాటం చేసి వీర మరణం పోందిన ఆదివాసీ ముద్దుబిడ్డ ,కోమరం భీమ్ వర్ధంతిని ఆదివాసీ నాయకులు శుక్రవారం ఏడూళ్ళ బయ్యారం క్రాస్ రోడ్డులోని కోమరం భీమ్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ,,,కోమరం భీమ్ అశయాలకు ప్రతి ఆదివాసీ కృషి చేయాలని అన్నారు.ఏజెన్సీ చట్టాల పై అవగాహన కలిగి ఉండాలని,ఆదివాసీ చట్టాలను కాపాడుకునేందుకు ప్రతి ఒక్క ఆదివాసీ ముందుకు రావాలని తెలిపారు. ఈ కార్యక్రమం లో జాతీయ ఆదివాసీ గిరిజన అభ్యుదయ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి గోగ్గల అర్కే దోర,పినపాక మండల అధ్యక్షులు కోమరం శ్రీను,మండల ప్రధాన కార్యదర్శి కుర్సం సారయ్య,ఆదివాసీ సేన మండల కన్వీనర్ సోలం వినయ్, కుంజా సారయ్య,ఆదివాసీ మీడీయా మిత్రుడు సనప భరత్ తదితరులు పాల్గొన్నారు.