ఘనంగా గణపతి హోమం
ఘనంగా గణపతి హోమం
కారేపల్లి, శోధన న్యూస్ : ఘనంగా కారేపల్లిలో అయ్యప్ప మాలధారుల ఆధ్వర్యంలో నగర సంకీర్తన కార్యక్రమాన్ని నిర్వహించారు. అయ్యప్పలు మండల దీక్ష ముగింపు దశకు చేరుకున్న తరుణంలో ఆదివారం ఇరుముడి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.ఇరుముడిని పురష్కరించుకోని శుక్రవారం నగర సంకీర్తన సాగించారు.ప్రమిద దీపాలతో అయ్యప్ప భజన చేస్తూ కారేపల్లి వీధులలో ఊరేగింపు చేశారు.అంతకు ముందు సాయిమందిరంలోని అయ్యప్ప పీఠం స్వాములు గణపతి హోమంను ఘనంగా నిర్వహించారు.ఆలయ అర్చకులు నాగసాయిశర్మ ఆధ్వర్యంలో కార్యక్రమాలను నిర్వహించారు.ఈ కార్యక్రమంలో గురుస్వాములు పాలిక సారయ్య,గుగులోత్ రాందాస్,కేతిమళ్ల శ్రీను, తేజావత్ శంకర్,సంగు సాయి,పాలిక శ్రీను తదితరులు పాల్గొన్నారు.