ఘనంగా జాతీయ గణిత దినోత్సవం
ఘనంగా జాతీయ గణిత దినోత్సవం
సత్తుపల్లి , శోధన న్యూస్ : గాంధీనగర్ ప్రాధమిక పాఠశాలలో ప్రఖ్యాత గణిత శాస్త్రజ్ఞుడు శ్రీనివాస రామానుజన్ జన్మదినాన్ని పురస్కరించుకుని నివాళులర్పించేందుకు గణిత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.ఈ సంధర్బంగా పాఠశాల గణిత ఉపాద్యాయుడు కంభంపాటి వెంకటేష్ మాట్లాడుతూ.. శ్రీనివాస రామానుజన్ ఒక తెలివైన భారత గణిత మేధావి అని,ఈ రంగానికి ఆయన చేసిన సేవలను విద్యార్థులకు గుర్తు చేశారు.విద్య మరియు పరిశోధనలలో గణిత శాస్త్రం యొక్క ప్రాముఖ్యతను ప్రోత్సహించడానికి సెమినార్లు మరియు వివిధ గణిత సంబంధమైన పోటీలను నిర్వహించడం ద్వారా ఈ దినోత్సవాన్ని జరుపుకుంటారని, రోజువారీ జీవితంలోని వివిధ అంశాలలో గణితం కీలక పాత్ర పోషిస్తుందని, ఆర్థిక నిర్వహణ మరియు పరిమాణాలను కొలవడం నుండి వాస్తవ-ప్రపంచ సమస్యలను పరిష్కరించడం వరకు గణితం ఎంతగానో ఉపకరిస్తుందని వెంకటేష్ అన్నారు.అనంతరం రామానుజన్ సంఖ్యగా పిలవబడే 1729 ఆకారంలో కూర్చుని పిల్లలు రామానుజన్ కి నివాళులు అర్పించారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు చక్రపాణి, ఉపాధ్యాయులు బేతిని నరసింహారావు,కంకటి వెంకటేశ్వరావు,కుమారి,భాగ్యాలక్షి వెంకటేష్,విద్యార్థులు పాల్గొన్నారు.