ఖమ్మంతెలంగాణ

ఘనంగా దుర్గామాత శోభాయాత్ర

 ఘనంగా దుర్గామాత శోభాయాత్ర
వైరా, శోధన న్యూస్: వైరా మండల కేంద్రంలో శ్రీ కోదండ రామస్వామి దేవా ఆలయంలో దసరా పండుగ సందర్భంగా శ్రీదేవి శరన్న నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు .శరన్ననవరాత్రి ముగింపు సందర్భంగా వైరా పట్టణంలో దుర్గాదేవి శోభయాత్ర ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాంతారావు, దుర్గామాత వేషధారణలతో భారీ ప్రదర్శన నిర్వహించారు. ఈ శోభాయాత్ర ప్రజలను ఆకర్షింపజేసింది. నియోజకవర్గ కేంద్రమైన వైరా పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించి. ప్రత్యేక పూజలు నిర్వహించి. సోమవారం నల్లచెరువులో దుర్గామాతను నిమజ్జనం చేశారు. ఈ కార్యక్రమంలో దేవాలయ కమిటీ చైర్మన్ మిట్టపల్లి సత్యంబాబు, మిట్టపల్లి శ్రీనివాసరావు, మిట్టపల్లి వెంకటరమణ, లగడపాటి కృష్ణమోహన్, మాదినేని కిషోర్ ,మిట్టపల్లి నాగి ,మిట్టపల్లి కిరణ్, ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *