ఘనంగా సోనియాగాంధీ జన్మదిన వేడుకలు
ఘనంగా సోనియాగాంధీ జన్మదిన వేడుకలు
యాదాద్రి భువనగిరిజిల్లా, శోధన న్యూస్ : కాంగ్రెస్ పార్టీ అధినేత్రి, తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ జన్మదినోత్సవ వేడుకలను శనివారం చౌటుప్పల్ మున్సిపల్ చైర్ పర్సన్ వెన్ రెడ్డి రాజు ఆధ్వ ర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన సోనియమ్మ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం కేక్ కటింగ్ చేసి స్వీట్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నాలుగు కోట్ల తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను నెరవేర్చిన గొప్ప నాయకురాలు సోనియా గాంధీ అన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ చిల్కూరి ప్రభాకర్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆకుల ఇంద్రాసేనా రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు బోయ దేవేందర్, మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సుర్వి నరసింహ గౌడ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పబ్బు రాజు గౌడ్, బాలు మహేంద్ర, ఉబ్బు వెంకటయ్య, బొబ్బిల్ల మురళీ, మొగుదాల రమేష్ గౌడ్, కౌన్సిలర్ కొయ్యడ సైదులు, కాసర్ల శ్రీనివాస్ రెడ్డి, సందగల్ల సతీష్, కామిషెట్టి భాస్కర్, పల్సం సత్యం తదితర సీనియర్ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.