చంద్రబాబుకి బెయిలు మంజూరు పట్ల టిడిపి సంబరాలు
చంద్రబాబుకి బెయిలు మంజూరు పట్ల టిడిపి సంబరాలు
మధిర, శోధన న్యూస్ : స్కిల్ డెవలప్ మెంట్ కేసులో టిడిపి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకి ఎపి హైకోర్ట్ రెగ్యులర్ బెయిల్ యిచ్చిన సందర్బంగా సోమవారం తెలంగాణ టిడిపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ వాసిరెడ్డి రామనాథం ఆధ్వర్యంలో మధిర టిడిపి శ్రేణులు స్థానిక తెలంగాణ తల్లి విగ్రహం సమీపంలో గల ఎన్టీఆర్ విగ్రహం వద్ద టపాసులు కాల్చి సంబరాలు చేసుకున్నారు. కార్యకర్తలందరూ జై బాబు, జైజై బాబు, సైకో పోవాలి. బాబు రావాలి అంటూ నినాదాలు చేసారు. ఈ సందర్భంగా డాక్టర్ రామనాథం మాట్లాడుతూ అక్రమంగా బాబుపై పెట్టిన కేసులో న్యాయం గెలిచిందని, స్కాష్ పిటీషన్ పై కూడా సుప్రీంకోర్టు లో చంద్ర బాబుకి అనుకూలంగా త్వరలో తీర్పు వస్తుందని, ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. త్వరలోనే నారా చంద్రబాబు నాయుడు కడిగిన ముత్యంలాగా మళ్లీ ప్రజాక్షేత్రంలోకి వస్తారని పేర్కొన్నారు. తప్పుడు కేసులతో ఎన్ని కుతంత్రాలు పన్నినా జగన్ సర్కారు బాబుని ఏమీ చేయలేరాన్నరు. అనంతరం టిడిపి నాయకులు, కార్యకర్తలు ఒకరికొకరు మిఠాయిలు తినిపించుకుని తమ ఆనందం వ్యక్తంచేసారు. ఈ కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి చేకూరి శేఖర్ బాబు, ఐటిడిపి కార్యదర్శి వేమూరి సునీల్, మధిర టౌన్ టిడిపి అధ్యక్ష కార్యదర్శులు మల్లాది హనుమంతరావు, చెరుకూరి కృష్ణారావు, రూరల్ మండల అధ్యక్షులు మార్నీడి పుల్లారావు, తెలుగుయువత అధికార ప్రతినిధి యలమంచిలి శివ, గద్దల ప్రకాశరావు, మేడా వెంకటేశ్వరరావు, గడ్డం రమేష్, పాశం రామనాథం,టిడిపి సాంస్కృతిక విభాగం బాధ్యులు కట్టా సుధీర్, వేల్పుల కొండ, వాసిరెడ్డి ఉపేంద్ర, కాశి, బెల్లంకొండ రామకోటయ్య, , మాదల నరసింహారావు, చటారి ముసలి, వాసిరెడ్డి ఈశ్వర్, శివ, కాంగ్రెస్ నాయకులు కోనా ధనికుమార్, మిరియాల రమణ, పాటిబండ్ల సత్యంబాబు తదితరులు పాల్గొన్నారు.