తెలంగాణభద్రాద్రి కొత్తగూడెం

చారిత్రాత్మకం… సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద  సభ   

చారిత్రాత్మకం… సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద  సభ   

– సభను  విజయవంతం చేసిన వారందరికీ కృతజ్ఞతలు

 – ప్రభుత్వ విప్  రేగా కాంతారావు 

మణుగూరు, శోధన న్యూస్ :   భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గం లోని బూర్గంపాడు మండలం లక్ష్మీపురం గ్రామంలో నిర్వహించిన ముఖ్యమంత్రి కేసీఆర్   ప్రజా ఆశీర్వాద సభ   చారిత్రాత్మకమని  ప్రభుత్వ విప్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, పినపాక ఎమ్మెల్యే  రేగా కాంతారావు అన్నారు.  బిఆర్ఎస్ పార్టీ కార్యాలయలో  మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.  ఎన్నికలలో భాగంగా  లక్ష్మీపురంలో నిర్వహించిన సిఎం కేసీఆర్  ప్రజా ఆశీర్వాద సభకు సుమారు 80 వేల మంది హాజరయ్యారని  అన్నారు. మరోసారి తనను గెలిపిస్తే ప్రజల ఆశీర్వాదం సీఎం కేసీఆర్   సహకారంతో పినపాక నియోజకవర్గం మరింత అభివృద్ధి చేస్తానని అన్నారు.  తెలంగాణ అభివృద్ధి ప్రదాత ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావు ని స్వయంగా చూసి వారి అద్భుతమైన ప్రసంగాన్ని చెవ్వులారా వినాలనే ఆసక్తితో అన్ని వర్గాల ప్రజలు తండోపతండాలుగా తరలివచ్చారున్నారు.  జనం కాలినడకన గుంపులు గుంపులుగా ద్విచక్ర వాహనాలు ఆటోలు కార్లలో స్వచ్ఛందంగా సభ స్థలానికి వేలాదిమంది చేరుకున్నారని వివరించారు, ఊహించిన దానికంటే ఎక్కువ సంఖ్యలో తరలివచ్చారని అన్ని వర్గాల ప్రజల పెద్ద సంఖ్యలో హాజరయ్యారన్నారు చుట్టుపక్కల రోడ్లన్నీ కూడా జనంతో నిండిపోయినయని జన ప్రభంజనం కనిపించింది అన్నారు , యావత్ దేశం తెలంగాణ అభివృద్ధి వైపే చూసే విధంగా అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు అందించి బంగారు తెలంగాణ అభివృద్ధి గా అభివృద్ధి చేసిన ఘనత సీఎం కేసీఆర్ కే దక్కుతుందని అన్నారు. సీఎం కేసీఆర్ అన్ని వర్గాల సంక్షేమం కోసం ప్రతిష్మాత్మకంగా ప్రవేశపెట్టిన ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందరి కుటుంబాలు లేవన్నారు. ఇప్పటివరకు ప్రభుత్వ లబ్ధి పొందిన ప్రతి ఒక్కరికి ఆశీర్వాదం బిఆర్ఎస్ కే ఉంటుంది అన్నారు ఈ నెల 30 తేదీన జరగనున్న సార్వత్రిక ఎన్నికలలో ప్రతి ఒక్కరు కారు గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని ఆయన కోరారు. ఈ సమావేశం లో మణుగూరు జెడ్పీటిసి పోశం నర్సింహారావు, బిఆర్ఎస్ నాయకులు ముత్యం బాబు, అడపా అప్పారావు, నవీన్, రామిరెడ్డి, శివాజీ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *