చెరువును తలపిస్తున్నచండ్రుగొండ జెడ్పీ ఉన్నత పాఠశాల
చెరువును తలపిస్తున్నచండ్రుగొండ జెడ్పీ ఉన్నత పాఠశాల
చండ్రుగొండ, శోధన న్యూస్ : మండల కేంద్రంలోని చండ్రుగొండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కురుస్తున్న వర్షంతో చెరువును తలపిస్తోంది. దీంతో గ్రామస్తులు ,విద్యార్థులు, యువకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వర్షాలు కురుస్తున్న ప్రతీ సారి పాఠశాల ఇలానే ఉంటుందని, ఏళ్లు గడుస్తున్నా పాఠశాల దుస్థితి మారడం లేదన్నారు. ఏళ్ల నాటి సమస్యలన్నీ అలాగే ఉంటున్నాయన్నారు. అధికారులు ప్రజాప్రతినిధులు వస్తున్నారు పోతున్నారే తప్ప పాఠశాల సమస్యలను పరిష్కరించిన దాఖలాలు లేవని వారు మండిపడుతున్నారు. వందలాదిమంది చదువుకునే విద్యార్థులు బురదలో పాఠశాల తరగతి గదిలోకి వెళ్లి పాఠాలు ఎలా చదువుకుంటారని చదువు పై ఎలా శ్రద్ధ చూపిస్తారని తల్లిదండ్రులు వాపోతున్నారు.ఇప్పటికైనా అధికారులు దృష్టి సారించి సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని కోరుతున్నారు.