ఛలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయండి-మాదిగ జేఏసీ భద్రాద్రి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ రవి
ఛలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయండి
-మాదిగ జేఏసీ భద్రాద్రి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ఆ దూరి రవి
ఇల్లందు, శోధన న్యూస్ : ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో ఇల్లందు నియోజకవర్గ ఇంచార్జ్ ముత్యాల శ్రీనివాస్ ఆధ్వ
ర్యంలో ఇల్లందు నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశం సోమవారం జరిగింది. ఈ కార్యక్రమంలో మాదిగ జేఏసీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్. ఆదూరి రవి మాదిగ మాట్లాడుతూఈ పార్లమెంట్ సమావేశాల్లోనే ఎస్ సి వర్గీకరణ బిల్లును ప్రవేశపెట్టి చట్ట బద్దత కల్పించాలనీ డిమాండ్ చేశారు.ఈ ప్రధాన డిమాండ్ తో తెలంగాణ తొలి ఎస్ సి కార్పొరేషన్ చైర్మన్. మాదిగ జేఏసీ వ్యవస్థాపకులు పిడమర్తి రవి ఆధ్వర్యంలో ఈ నెల 18, 19 తేదీలలో చలో ఢిల్లీ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందన్నారు.ఎస్ సి వర్గీకరణ చేయకుండా మాదిగలను మోసం చేస్తున్న బి జి పి ప్రభుత్వాన్ని డిల్లి గడ్డ మీద నిలదీయడానికి నిర్వహిస్తున్న చలో ఢిల్లీ కార్యక్రమాన్ని ఉద్యోగస్తులు, నాయకులు, యువకులు, విద్యార్థులు మేధావులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో భద్రాది జిల్లా మాదిగ జేఏసీ మహిళా అధ్యక్షురాలు బొప్పి భాగ్యలక్ష్మి. ఇల్లందు నియోజకవర్గ కన్వీనర్ బండారి శ్రీనివాస్. ఇల్లంపట్టణం మండల గౌరవ అధ్యక్షులు ఇసుకల వెంకన్న. ఇల్లందు పట్టణ అధ్యక్షులు గుండేటి రాజలింగు. కామేపల్లి మండల అధ్యక్షులు కొండ్రు రాంబాబు. బయ్యారం మండల అధ్యక్షులు వీరబాబు. టేకులపల్లి మండల అధ్యక్షులు ప్రవీణ్. గార్ల మండల అధ్యక్షులు వడ్డేపల్లి మల్లేష్. మాదిగ జేఏసీ నియోజకవర్గ సీనియర్ నాయకులు మాచర్ల విజయ్. సువార్త. స్వర్ణకుమారి. ఉష. దుర్గ. భాగ్యమ్మ. ఇందిరా. కోటయ్య. సంజీవరావు. శివాజీ .బన్నీ . చిర చిరా బాబురావు తదితరులు పాల్గొన్నారు.