జనసేన అభ్యర్థికి బీఫామ్ అందజేసిన పవన్ కళ్యాణ్
అభ్యర్థికి బీఫామ్ అందజేసిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్
అశ్వారావుపేట , శోధన న్యూస్ : త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు గాను బిజెపి జనసేన పొత్తులలో భాగంగా అశ్వారావుపేట అసెంబ్లీ స్థానాన్ని జనసేనకు కేటాయించారు. అశ్వారావుపేట అభ్యర్థిగా ఎంపికైన ముయ్యబోయిన ఉమాదేవికి ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ బుధవారం బీ-ఫామ్ అందజేశారు. తనపై ఎంతో నమ్మకం ఉంచి అశ్వారావుపేట అసెంబ్లీ స్థానాన్ని కేటాయించిన పవన్ కళ్యాణ్ కు ఉమాదేవి కృతజ్ఞతలు తెలిపారు. అలాగే నియోజకవర్గంలో గ్రామ గ్రామానికి తిరిగి గెలుపు కోసం అహర్నిశలు కృషి చేస్తానని ఆమె తెలిపారు. తనకు జనసేన, బిజెపి పార్టీల నేతలు కార్యకర్తలు పూర్తిస్థాయిలో సహాయ సహకారాలు అందించాలని ఆమె కోరారు.