తెలంగాణహైదరాబాద్

జర్నలిస్టుల సంక్షేమానికి కృషి  -ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి

జర్నలిస్టుల సంక్షేమానికి కృషి 

-ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి

 హైదరాబాద్, శోధన న్యూస్ : జర్నలిస్టుల సంక్షేమానికి ఎల్లవేళలా కృషి చేస్తానని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి అన్నారు. నూతన సంవత్సరం సందర్భాన్ని పురస్కరించుకొని సోమవారం ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డిని కలిసి తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూ జెఎఫ్) ఆధ్వర్యంలో నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. జర్నలిజం అనేది ప్రభుత్వాలకు ప్రజలకు మధ్య వారధిగా పని చేయాలని అన్నారు. అందరం కలిసి పనిచేసినప్పుడే ప్రజలకు మేలు చేయగలుగుతామని తెలిపారు.
వార్తల సేకరణలో వాటిని ప్రచురించడంలో జర్నలిస్టుల కృషి మరువలేనిది అన్నారు.  జనహితం కోసం పనిచేస్తున్న జర్నలిస్టుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, వాటి పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడబ్ల్యూ జెఎఫ్ మేడ్చల్ జిల్లా కోశాధికారి బెల్ది అశోక్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గుమ్మడి హరిప్రసాద్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు యవపురం రవి, పటేల్ నరసింహ, మేడ్చల్ జిల్లా సహాయ కార్యదర్శి జి.రోజారాణి, దోమ్మాటి కిరణ్ కుమార్, డి.శ్రీనివాస్ రావు, బి.శాంతి బాబు, మమత తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *