జర్నలిస్టుల సమస్యలు పరిష్కరిస్తా -తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి
జర్నలిస్టుల సమస్యలు పరిష్కరిస్తా
-తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్, శోధన న్యూస్ : ప్రెస్ అకాడమీ చైర్మన్ భర్తీ చేసిన తర్వాత జర్నలిస్టుల సమస్యలు పరిష్కరిస్తామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. సోమవారం ఆయన మాట్లాడుతూ..3వ తేదీన పీసీసీ విస్తృతస్థాయి సమావేశం ఉందని తెలిపారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల మేరకు పదవులు ఇస్తామన్నారు. పార్టీ కోసం పనిచేసిన వారితో నామినేటెడ్ పదవులు భర్తీ చేస్తామన్నారు. తనకు దగ్గర, బంధువులనో పదవులు ఇచ్చేది ఉండదన్నారు. తాను ఏది చేసినా విస్తృతస్థాయి ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని పదవులు భర్తీ చేస్తానని తెలిపారు పార్టీ కోసం పని చేసిన వారికీ పదవులు ఇస్తామన్నారు.హైదరాబాద్ కమిషనరేట్లకు కమిషనర్లను నియమించామని వారికీ అవసరమైన మ్యాన్‌పవర్‌ను వాళ్లే ఎంపిక చేసుకుంటారని చెప్పారు. శాఖలకు ప్రతిభ కలిగిన అధిపతులను నియమిస్తానని వాళ్ల పరిధిలో అవసరమైన అధికార్లను నియమించుకుని యంత్రాంగం సక్రమంగా పనిచేసేటట్లు చూసుకోవాలని సూచించారు. అధికార్ల నియామకాల్లో సామాజిక న్యాయం కూడా జరిగేట్లు చూస్తామన్నారు. సంస్కరణలు తీసుకొచ్చి స్ట్రీమ్ లైన్ చేసే పనిలో ఉన్నట్లు తెలిపారు. తన వద్ద చెప్పేది ఒకటి చేసేది ఒకటి ఉండదన్నారు. జర్నలిస్టులకు సంబంధించి సమస్యను పూర్తి స్థాయిలో పరిష్కరిస్తామని.. ఇప్పటి నుంచి వందరోజుల్లో పరిష్కరిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.