ఖమ్మంతెలంగాణ

జాతీయ స్థాయి ఖో ఖో పోటీలకు దుర్గాభవాని ఎంపిక 

జాతీయ స్థాయి ఖో ఖో పోటీలకు దుర్గాభవాని ఎంపిక 

ఎర్రుపాలెం, శోధన న్యూస్ :  వే మి రె డ్డి వెంకటరెడ్డి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన సిహెచ్ దుర్గ భవాని, స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ విభాగంలో అండర్ 14 బాలికల విభాగంలో మెదక్ జిల్లాలో రాష్ట్రస్థాయి ఖో .. ఖో పోటీలో మంచి ప్రతిభ కనబరచడం తో , తెలంగాణ రాష్ట్రం తరఫున జాతీయ స్థాయి ఖో.. ఖో పోటీలకు ఎంపికైనట్టు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు.. బి. సుభద్ర దేవి ,సోమవారం విలేకరులకు తెలిపారు. పాఠశాలలో ఏర్పాటు చేసిన అభినందన సభకు గ్రామ సర్పంచ్ శీలం జయలక్ష్మి హాజరయ్యారు. దుర్గ భవాని మంచి ప్రతిభ కనపరచడంతో పోటీలకు ఈనెల 13 నుంచి 18 తేది వరకు బెంగళూరులో జరిగే జాతీయస్థాయి పోటీల్లో పాల్గొంటుందని పాఠశాల ప్రధానోపాధ్యాయులు తెలిపారు. పాఠశాల పనిచేస్తున్న వ్యాయామ ఉపాధ్యాయులు గూడూరు సత్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ దుర్గా భవాని ఖో .. ఖో అంటే ప్రాణంగా నిరంతరం స్కిల్స్ ప్రాక్టీస్ చేయటం వలన జాతీయ స్థాయికి పోటీలు ఎంపికైందని అన్నారు. తల్లిదండ్రుల ప్రోత్సవముతో పాఠశాల సాధన చేసిందని దీంతో గ్రామస్తులు ప్రత్యేకం గా అభినందించారని అన్నారు. కార్యక్రమంలో ఎస్ఎంసి చైర్మన్ లక్కిరెడ్డి కృష్ణారెడ్డి, జడ్పిటిసి శీలం కవిత, ఎంపీటీసీ కృష్ణారావు, శ్రీకాంత్ రెడ్డి, య ర్ర మ ల పూర్ణచంద్రారెడ్డి, మల్లేశ్వరావు, శ్రీనివాస్ రెడ్డి, ఉషా కిరణ్, ఉపాధ్యాయులు పుల్లమ్మ, వెంకటేశ్వరరావు, దేశీయ, సునీత, నరసింహారావు, సత్యనారాయణ, వీరస్వామి, సుజాత ,రమాదేవి, విద్యార్థులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *