జిల్లా ఓటరు తుది జాబితా విడుదల చేసిన జిల్లా ఎన్నికల అధికారి
జిల్లా ఓటరు తుది జాబితా విడుదల చేసిన జిల్లా ఎన్నికల అధికారి
భద్రాద్రి కొత్తగూడెం, శోధన న్యూస్ : జిల్లా ఓటరు తుది జాబితాను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అల శనివారం విడుదల చేశారు. ఈ నెల 30వ తేదీన జరుగనున్న శాసనసభ ఎన్నికల నేపథ్యంలో గత నెల 4వ తేదీన ఓటరు జాబితా ప్రకటించామని, తదుపరి ఎన్నికల సంఘ మార్గదర్శకాల మేరకు అక్టోబర్ 31వ తేదీ వరకు నూతన ఓటర్లు నమోదుకు చర్యలు చేపట్టినట్ల తెలిపారు. జిల్లాలోని ఐదు నియోజకర్గాల పరిధిలో ఉన్న 1095 పోలింగ్ కేంద్రాల్లో 966439 మంది ఓటర్లున్నట్లు తెలిపారు. వీరిలో 471745 మంది పురుషులు, 494650 మంది మహిళలు, ఇతరులు 44 మంది ఉన్నట్లు ఆమె తెలిపారు. నూతనంగా ఓటు హక్కు నమోదు చేసుకున్న వారందరు ఈ నెల 30వ తేదీన జరుగనున్న శాసనసభ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోనున్నారని అనారు. నూతనంగా ఓటు హక్కు. పొందిన వారిని, ఓటరు నమోదులో భాగస్వాములైన ప్రతి ఒక్కరిని ఆమె అభినందించారు.