జిల్లా ప్రజలకు దసరా శుభాకాంక్షలు
జిల్లా ప్రజలకు దసరా శుభాకాంక్షలు
-జిల్లా కలెక్టర్ ప్రియాంక
కొత్తగూడెం, శోధన న్యూస్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అల జిల్లా ప్రజలకు విజయదశమి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. మన ఆచార, సంప్రదాయాలకు ప్రతీక, ఆడబిడ్డల ఆత్మ గౌరవాన్ని చాటే పూల పండుగ బతుకమ్మ వేడుకలను తొమ్మిది రోజుల పాటు తీరొక్క పూలతో బతుకమ్మలను పేర్చి ఆటా, పాటలతో వైభవోపేతంగా జరుపుకున్నామన్నారు. అమ్మవారి ఆశీస్సులతో జిల్లా ప్రజలందరూ సుఖశాంతులతో, ఆయురారోగ్యాలతో ఆనందంగా జీవిచాలని కలెక్టర్ ఆకాంక్షించారు.