జిఎల్ బికే ఎస్ ను గెలిపించండి
జి ఎల్ బి కే ఎస్ ను గెలిపించండి
ఇల్లందు, శోధన న్యూస్ : ఈ నెల 27న జరిగే సింగరేణి ఎన్నికల్లో చక్రంలో సుత్తి గుర్తుకు ఓటేసి విప్లవ కార్మిక సంఘాలను గెలిపించాలని గోదావరిలోయ బొగ్గు గని కార్మిక సంఘం(జి ఎల్ బి కే ఎస్)అధ్యక్షులు సాధినేని వెంకటేశ్వరరావు, ఐ ఎఫ్ టి యు జిల్లా ప్రధాన కార్యదర్శి కొక్కు సారంగపాణి కార్మికులకు విజ్ఞప్తి చేశారు.సింగరేణి ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం ఇల్లందు జెకె-5 ఓసిలో, జిఎం కార్యాలయంలో నిర్వహించిన ప్రచార మీటింగులలో వారు పాల్గొని మాట్లాడారు.జి ఎల్ బి కే ఎస్ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ బయ్యా వరప్రసాద్ అధ్యక్షతన జరిగిన ఈకార్యక్రమంలో జిఎల్ బి కే ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జె. సీతారామయ్య,(సిపి ఐ)ఎంఎల్ న్యూడెమోక్రసీ ఇల్లందు డివిజన్ కార్యదర్శి తుపాకుల నాగేశ్వరరావు, ఐఎఫ్టియు రాష్ట్ర నాయకులు ఎండి. రాసుద్దిన్,బానోతు రామ్ సింగ్,ఇల్లందు ఏరియా కమిటీ అధ్యక్షులు డి.మోహన్ రావు,జిల్లా నాయకులు రామిశెట్టి నరసింహారావు, ఉమామహేశ్వరరావు, ప్రివైఎల్ రాష్ట్ర నాయకులు మోకాళ్ళ రమేష్ తదితరులు పాల్గొన్నారు.