జోరుగా బిఆర్ఎస్ ఎన్నికల ప్రచారం
జోరుగా బిఆర్ఎస్ ఎన్నికల ప్రచారం
-హ్యాట్రిక్ విజయం ఖాయం: ఎమ్మెల్యే రేగా
మణుగూరు, శోధన న్యూస్: మండలంలోని పలు ప్రాంతాల్లో బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు జోరుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రచారం చేస్తున్న ఎమ్మెల్యే రేగాకు ప్రజలు అడుగడుగున బ్రహ్మరథం పట్టారు. వృద్ధులు ఆప్యాయంగా పలకరించి కొడుకా నీకే మా ఓటు అని చెప్పారు, కారు గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రేగా కాంతారావు మాట్లాడుతూ.. తనను మూడోసారి ఆశీర్వదిస్తే పినపాక నియోజకవర్గం అన్ని రంగాలలో అభివృద్ధి చేసి ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా నియోజకవర్గాన్ని వేల కోట్లతో అన్ని రంగాలలో అభివృద్ధి చేసినట్లు తెలిపారు.పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందించిన ఘనత సీఎం కేసీఆర్ కే దక్కిందన్నారు. సీఎం కేసీఆర్ ప్రకటించిన బిఆర్ఎస్ నూతన మ్యానిఫెస్టో తో ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని ఆయన అన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు అమలు అవుతున్నాయని, మూడోసారి బిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాగానే సంక్షేమ పథకాల అమలులో చరిత్ర సృష్టిస్తుందన్నారు. పినపాక నియోజకవర్గం లో జరిగిన అభివృద్ధిని చూసి బిఆర్ఎస్ కే పట్టం కట్టాలని కోరారు. తెలంగాణా రాష్ట్రం ఏర్పడ్డాక సీఎం కేసీఆర్ పాలనలో అభివృద్ధిలో దూసుకు వెళ్తుంది అన్నారు. సీఎం కేసీఆర్ సారధ్యంలో బిఆర్ఎస్ ప్రభుత్వం గ్రామీణ ప్రాంత పేద ప్రజలకు అనేక పథకాలు ప్రవేశపెట్టిందన్నారు. ప్రస్తుతం రైతులకు ఎకరానికి రూ.10000 ఇస్తుండగా వాటిని 16 వేలకు పెంచినట్లు తెలిపారు. కళ్యాణ లక్ష్మి పథకం కింద రెండు లక్షలు గ్యాస్ సిలిండర్ రూ.400 కి ఇస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించినట్లు తెలిపారు. సౌభాగ్య లక్ష్మి పథకం కింద ప్రతి పేద మహిళలకు రూ3 వేలు దివ్యాంగులకు రూ6 వేలు చెల్లిస్తామన్నారు. పేదలకు తెల్ల రేషన్ కార్డు ద్వారా దొడ్డు బియ్యానికి బదులు సన్నబియ్యం అందిస్తామని తెలిపారు. ప్రతి కుటుంబానికి రూ5 లక్షల బీమా పథకం కల్పిస్తున్నట్లు తెలిపారు. దేశంలోనే ఎక్కడలేని విధంగా రైతులకు రైతుబంధు 24 గంటల విద్యుత్ అందిస్తున్న రాష్ట్రాలు లేవన్నారు. ఒక తెలంగాణలోనే సీఎం కేసీఆర్ ఈ పథకాలు అమలు చేస్తున్నారని తెలిపారు కులవృత్తులను బలోపేతం చేసి వారు ఆర్థికంగా బలోపేతం కోసం సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.