ఖమ్మంతెలంగాణ

డబ్బుంటే ఎవరినైనా ఏదైనా చేయొచ్చు అనుకుంటే పొరపాటే..!

డబ్బుంటే ఎవరినైనా ఏదైనా చేయొచ్చు అనుకుంటే పొరపాటే..!

–ప్రజా ఆశీర్వాద సభలో కెసిఆర్.

పాలేరు, శోధన న్యూస్: డబ్బుంటే ఎవరినైనా ఏదైనా చేయొచ్చు అనుకుంటే పొరపాటే..అని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అన్నారు. పాలేరు నియోజకవర్గం జిళ్ళచెర్వు గ్రామంలో జరిగిన ప్రజా ఆశీర్వాద బహిరంగ సభలో సీఎం కేసీఆర్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ…ఎమ్మెల్యే కందాళ వంటి ప్రజా నాయకులు అరుదుగా ఉంటారు. ఆయన ప్రసంగం విన్న అది ప్రసంగంలో అనిపించలేదు. ఒక కుటుంబం మాట్లాడుతున్నట్టు ఉంది. అలాంటి వ్యక్తిని మీరు పోగొట్టుకోవద్దు కందాల ఉపేందర్ రెడ్డి నీ మరొక్కసారి గెలిపించి అసెంబ్లీ వాలికి పంపిస్తే పాలేరు నియోజకవర్గం మొత్తం లో ఉన్న దళితులందరికీ దళిత బంధు ఇచ్చే పూజినాదని మీకు మాటిస్తున్నానని తెలిపారు.కాంగ్రెస్ మోసం చేస్తే ఆరోజు సీఎం కేసీఆర్ శవ యాత్ర నా..జైత్ర యాత్ర నా..అని ఆమరణ దీక్ష చేశానని తెలిపారు.  తెలంగాణ వచ్చుడా కేసీఆర్ సచ్చుడా అనే నినాదంతో దీక్ష చేపడితే కాంగ్రెస్ ప్రభుత్వం ఇదే ఖమ్మం జైలు లో నన్ను పెట్టారు. అయినా ఎవరికి భయపడకుండా తెలంగాణని సాధించుకున్నామన్నారు. బిఆర్ఎస్ ప్రభుత్వం రాకముందు..పాలేరు లో మంచి నీరు కూడా ఇవ్వలేదు. ఈరోజు మనకు త్రాగునీరు సాగునీరు కరువు ఎక్కడైనా ఉందా అనేది మీరే చెప్పాలి.భక్త రామదాసు ప్రాజెక్టు పూర్తి చేసి..నీళ్ళు అందించాము. అది కాంగ్రెస్ కళ్ళకు కనపడటం లేదా…నిన్నటి వరకు సీఎం కేసీఆర్ వలనే నీళ్ళు వచ్చాయని చెప్పారు.ఇపుడు నరం లేని నాలుకలు కనుక..అలా మాట్లాడతారు.ఇక్కడ భూముల ధరలు కూడా పెరిగాయి. అది ఎవరి వలన ప్రజలే చెప్పాలన్నారు. కొందరు పదవులు కోసం పూటకో పార్టీ లు మారతారు. అలాంటోళ్లు నమ్మొద్దు అని అన్నారు.ఉద్యమాలు జరిగిన చైతన్య వంతమైన ప్రాంతం ఇది.డబ్బులతో,అహంకారంతో వచ్చే వాళ్లకు అధికారం ఇవ్వొద్దు అని అన్నారు.పించన్లు పెంచాము..ఇపుడు ఐదు వేలకు పెంచుతామని హామీ ఇస్తున్నానన్నారు.రైతు బందు ను పుట్టించింది కేసీఆర్ కదా..?గతంలో రుణాలు కట్టలేదని జప్తు చేసేవారు..పట్టించు కున్న నాథుడు లేడు,నేను రైతు బిడ్డను..నాకు రైతు బాధలు తెలుసు అని అన్నారు.

-తెలంగాణ లో వరి ఎక్కువ పండిస్తున్నాం
సీతారామ ప్రాజెక్టు పూర్తి చేసి..శాశ్వత కరువు లేకుండా చేస్తాము.ఉత్తమ్ కుమార్ రెడ్డి..రైతు బందు దుబారా అని..అంటున్నాడు.ప్రస్తుత పిసిసి అధ్యక్షుడు మూడు గంటల కరెంట్ చాలని అంటున్నాడు.పొరపాటు కాంగ్రెస్ గెలిస్తే..రైతు బందు రాం రాం..దళిత బందు రాదు. కరెంటు కాటిలో కలుస్తది. పొరపాటున కాంగ్రెస్ గెలిస్తే మళ్ళీ కథ ముందుకు వస్తది కనుక ప్రజలు ఆలోచించాలన్నారు.
-తుమ్మల ,పొంగులేటి పై సీఎం కేసీఆర్ విమర్శలు
ఈ జిల్లాలో ఇద్దరు నేతలు డబ్బు అహంకారం..తో..మాట్లాడుతున్నారు. బిఆర్ఎస్ ఎమ్మెల్యే లను అసెంబ్లీ గేట్ తాక నీయనని అంటున్నాడు.డబ్బు అహంకారం తో.. మాట్లాడుతున్నారు.తుమ్మల నాగేశ్వరరావు కు నేను అన్యాయం చేశానని చెబుతున్నాడు.ఓడిపోయి ఇంట్లో మూలన కూర్చొని ఉంటే పిలిచి మంత్రి పదవి ఇచ్చాము. అదేనా నేను చేసిన మోసం ఇక్కడ పాలేరు లో పోటీ చేస్తే ఎమ్మెల్యే ఎమ్మెల్యేగా గెలిపించుకున్నాం అదేనా నేను చేసిన మోసం.
జిల్లా మొత్తం నీకు పెత్తనం ఇస్తే ఖమ్మం జిల్లాలో ఒక్క సీటు రాకుండా చేసావు గుండు సున్నా.
బిఆర్ఎస్ తుమ్మల కు అన్యాయం చేసిందా..తుమ్మల బిఆర్ఎస్ కు అన్యాయం చేశాడా. ఇది కూడా ప్రజలే తేల్చాలి.కందాళ ఉపేందర్ రెడ్డి ని గెలిపించండి,పాలేరు నియోజకవర్గం మొత్తం దళిత బందు ఇస్తాం.మళ్ళీ బిఆర్ఎస్ ప్రభుత్వం వస్తుంది. అని కెసిఆర్ అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *