ఖమ్మంతెలంగాణ

డాక్టరేట్ అవార్డు నా తల్లిదండ్రులకే అంకితం.

డాక్టరేట్ అవార్డు నా తల్లిదండ్రులకే అంకితం.
-అవార్డు గ్రహీత శీలం రామారావు
కల్లూరు , శోధన న్యూస్ : పిల్లల భవిష్యత్తు ఉన్నతంగా ఉండాలని తల్లిదండ్రులు పడే తపన వర్ణనాతీతమని,ఉన్నత స్థాయికి ఎదిగిన కొడుకు విజయం వెనక తల్లిదండ్రుల పాత్రే కీలకమని ఆ కష్టానికి వెలకట్టలేమని అందుకే నేను సాధించిన డాక్టరేటు అవార్డును నా తల్లిదండ్రులకు అంకితం ఇస్తున్నానని డాక్టరేట్ అవార్డు గ్రహీత శీలం రామారావు అన్నారు. మండల కేంద్రంలోని డాక్టర్ రాధాకృష్ణమూర్తి హాస్పిటల్ రోడ్డు నివాసి శీలం రామారావు ఉస్మానియా యూనివర్సిటీ వృక్షశాస్త్ర విభాగము నందు డాక్టరేట్ అవార్డు పొందారు. 23 సంవత్సరాలుగా ఉపాధ్యాయ వృత్తిలోనే ఉన్నారు. 8 సంవత్సరాలు కల్లూరు ప్రతిభ జూనియర్& డిగ్రీ కళాశాలలో వృక్షశాస్త్ర అధ్యాపకుడిగా పనిచేసి అనంతరం ట్రిపుల్ ఐటీ బాసరలో గత 15 సంవత్సరాలుగా బయో సైన్సెస్ శాఖలో అధ్యాపకునిగా విధులు నిర్వహిస్తున్నారు. ట్రిపుల్ ఐటి బాసర విశ్వవిద్యాలయంలో పనిచేస్తూనే డాక్టరేట్ అవార్డు పొందారు. తమ విశ్వవిద్యాలయం నుండి డాక్టరేటు పొందిన శీలం రామారావును ట్రిపుల్ ఐటీ బాసర వైస్ ఛాన్స్లర్ ప్రొఫెసర్ వెంకటరమణ, డైరెక్టర్ ఆచార్య సతీష్ కుమార్ గార్లు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ట్రిబుల్ ఐటీ బాసర విశ్వవిద్యాలయంలో ఇప్పటికే చాలామంది అధ్యాపకులు డాక్టరేట్ అవార్డులు పొందారని తెలిపారు. వారి జాబితాలోకి మరొక అధ్యాపకుడు శీలం రామారావు పి హెచ్ డి అవార్డుతో స్థానం సంపాదించుకోవడం ఆనందంగా ఉందని అన్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడంలోనూ సమగ్రమైన కీలక పాత్ర పోషించారని ప్రస్తుతం పరిశోధన రంగంలోనూ నాణ్యమైన విద్యను అందించడంలోనూ వీరి పాత్ర ఎంతో కీలకమని కొనియాడారు. డాక్టర్ శీలం రామారావు  ఇకలాజికల్ ఇంప్లికేషన్స్ అండ్ కన్జర్వేషన్ స్ట్రాటజీస్ ఆఫ్ కొండగట్టు హిల్ ఫారెస్ట్ తెలంగాణ, ఇండియా అనే అంశంపై పరిశోధన చేసి డాక్టరేట్ పొందారని తెలియజేశారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం బోటని విభాగం ఆచార్యులు డాక్టర్ ఎ.విజయ భాస్కర్ రెడ్డి గారి పర్యవేక్షణలో పరిశోధన పూర్తిచేశారని అన్నారు. వీరు పలు జాతీయ, అంతర్జాతీయ సదస్సులలో పలు పరిశోధనా పత్రాలను ప్రచురించారు ఈ సందర్భంగా డాక్టరేట్ అవార్డు గ్రహీత శీలం రామారావు మాట్లాడుతూ డాక్టర్ ఏ విజయభాస్కర్ రెడ్డి పర్యవేక్షణలో పనిచేయడం గర్వంగా ఉందని ఆయన సహాయ సహకారాలు ఎన్నటికీ మరువలేనని అన్నారు. నా పరిశోధనకి తోడ్పాటు అందించిన ట్రిపుల్ ఐటీ బాసర సిబ్బందికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నట్లు అన్నారు. చిన్నప్పటినుండి విద్యాభ్యాసంలో విశిష్ట కృషి చేసిన తన తల్లిదండ్రులకు డాక్టరేటు అవార్డును అంకితం చేస్తున్నట్లు తెలిపారు.I కల్లూరు మండల ప్రముఖులు రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ డాక్టర్ లక్కినేని రఘు , ప్రెస్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు ధర్నా సి బాలరాజు కోట పుల్లయ్య మరియు అధ్యాపకులు,విద్యార్థులు కుటుంబ సభ్యులు డాక్టర్ శీలం రామారావుకు అభినందనలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *