డిప్యూటీ సిఎం భట్టి మంత్రులు తుమ్మల, పొంగులేటికి ఘన స్వాగతం.
డిప్యూటీ సిఎం భట్టి మంత్రులు తుమ్మల, పొంగులేటికి ఘన స్వాగతం.
జూలూరుపాడు, శోధన న్యూస్: నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం లో మంత్రులు గా ప్రమాణ స్వీకారం చేసి భద్రాచలం దైవ దర్శనం కోసం వెళుతున్న డిప్యూటీ సిఎం బట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి,ఎమ్మెల్యే రాందాస్ నాయక్ లకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు.ఆదివారం హైదరాబాద్ నుంచి భద్రాచలం సీతారామ చంద్రస్వామి ఆలయ దర్శనానికి వెళుతున్న తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్ధిక,ఇంధన శాఖ మంత్రి భట్టి విక్రమార్క, రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు సాయిబాబు ఆలయం వద్ద ఘన స్వాగతం పలికారు.కాంగ్రెస్ ప్రభుత్వం లో మంత్రులు గా ప్రమాణ స్వీకారం చేసిన ముగ్గురు మంత్రులు తొలిసారిగా జిల్లాకు వస్తుండటంతో కాంగ్రెస్ శ్రేణులు స్వాగతం పలికేందుకు హాజరయ్యారు. పెద్ద సంఖ్యలో హాజరై పార్టీ నాయకులు,కార్యకర్తలకు మంత్రులు అభివాదం తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాలోత్ మంగిలాల్ నాయక్, వెంగన్నపాలెం ఎంపిటిసి దుద్దుకురి మధుసూదన్ రావు,వేల్పుల నర్సింహారావు, నర్వినేని పుల్లారావు, పోతురాజు నాగరాజు,నవీన్ రాథోడ్,రామిశెట్టి నాగేశ్వరరావు, మిర్యాల కిరణ్ తదితరులు పాల్గొన్నారు.