డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కలిసిన ఎమ్మెల్యే రామదాసు నాయక్
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కలిసిన ఎమ్మెల్యే రామదాసు నాయక్
వైరా, శోధన న్యూస్: తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క రాష్ట్ర సచివాలయంలో గురువారం తన ఛాంబర్ లో వేద పండితుల మంత్రచనాలతో బాధ్యతలు స్వీకరిస్తున్న తరుణంలో వైరా శాసనసభ్యులు మాలోతు రామదాసు నాయక్ ఆయన్ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు.భట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రిగా ఆర్థిక విద్యుత్తు ప్రణాళిక శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తున్న శుభ సందర్భంగా వారిని కలుసుకొని శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో డిప్యూటీ సీఎం గా ప్రగతి భవన్ ను ఈనాడు ప్రజాభవన్ ఉప ముఖ్యమంత్రి హోదాలో శ్రీ మల్లు భట్టి విక్రమార్క కేటాయించటం చాలా సంతోషంగా ఉందని చెప్పారు. వారి సారధ్యంలో తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాలకు సమచిత గౌరవ లభిస్తుందని అభివృద్ధిసంక్షేమ పథకాలు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు గొప్ప స్థాయిలో వారి ద్వారా అందించడం జరుగుతుందని చెప్పారు. శుభాకాంక్షలు తెలిపిన వారిలో మాజీ మార్కెట్ వైస్ చైర్మన్ బి రాజశేఖర్ వైరా మండల పార్టీ అధ్యక్షుడు సేలం వెంకట నర్సిరెడ్డి పలువురు నాయకులు ఉన్నారు.