డిసిసిబి డైరెక్టర్ బ్రహ్మయ్యను సన్మానించిన సర్పంచ్
డిసిసిబి డైరెక్టర్ బ్రహ్మయ్యను సన్మానించిన సర్పంచ్
అశ్వాపురం, శోధన న్యూస్ : ఉమ్మడి ఖమ్మం జిల్లా డిసిసిబి డైరెక్టర్, అశ్వాపురం సోసైటి అధ్యక్షులు తుళ్ళూరి బ్రహ్మయ్యని భద్రాద్రి కొత్ర్హగుడెం జిల్లా అశ్వాపురం మండలం అశ్వాపురం గ్రామపంచాయతీ సర్పంచ్ బానోత్ శారద- సదర్ లాల్ దంపతులు శుక్రవారం శాలువాతో ఘనంగా సన్మానించి సత్కరించారు.ఈ సందర్భంగా వారు బ్రహ్మయ్య తో 30 సంవత్సరాల రాజకీయ జీవితాన్ని గుర్తు చేసుకున్నారు. తుళ్ళూరి బ్రహ్మయ్య తమకు అందించిన తోడ్పాటు మరువలేమని భవిష్యత్లో వారి ఆశీస్సులు మాకు ఎల్లవేళలా ఉండాలని ఆకాంక్షించారు. రానున్న రోజుల్లో తుళ్ళూరి బ్రహ్మయ్య రాజకీయంగా అత్యున్నత స్థాయికి ఎదగాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో బ్రహ్మయ్య అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
