డిస్ట్రిబ్యూషన్, పోలింగ్ కేంద్రాలను సందర్శించిన జిల్లా కలెక్టర్ ప్రియాంక
నేడు జరిగే ఎన్నికలకు సర్వం సిద్ధం
– డిస్ట్రిబ్యూషన్, పోలింగ్ కేంద్రాలను సందర్శించిన జిల్లా కలెక్టర్
-భారీ పోలీసు బందోబస్తు
-ఉదయం 7 గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు పోలింగ్
ఇల్లందు శోధన న్యూస్: నేడు ఇల్లందు నియోజకవర్గంలో జరిగే శాసనసభ ఎన్నికలకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించేందుకు జిల్లా కలెక్టర్ ప్రియాంక అలా బుధవారం ఇల్లందు సందర్శించారు. ఇందులో భాగంగా స్టేషన్ బస్తిలోని పోలింగ్ స్టేషన్, సింగరేణి జై కే హై స్కూల్ గ్రౌండ్లో ఏర్పాటుచేసిన పోలింగ్ సిబ్బంది డిస్ట్రిబ్యూషన్ పాయింట్ ను సందర్శించి అధికారులతో మాట్లాడారు. నియోజకవర్గంలో ఓటు హక్కు వినియోగించుకునే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఉదయం 7 గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. ఇల్లందు నియోజకవర్గ సంబంధించిన 241 పోలింగ్ స్టేషన్లకు గాను ఏవీఎంలను జె కే స్కూల్ కు చేర్చి గత రెండు రోజులుగా వాటిని ఎన్నికల అధికారి ఆధ్వర్యంలో పరిశీలించారు. వాటిని వివిధ పోలింగ్ స్టేషనులకు సంబంధించిన ఈవీఎంల పంపిణి ని ప్రారంభించారు.ఇల్లందు నియోజకవర్గంలోని 241 పోలింగ్ స్టేషన్లకు గాను సమస్యాత్మక ప్రాంతాలుగా 48 పోలింగ్ కేంద్రాలు గుర్తించారు. 20589 మంది ఎన్నికల సిబ్బంది, 26 సెక్టార్లు 37 రూట్లను ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం రెండు గంటలకు 46 ఆర్టీసీ బస్సులో ఈవీఎంలతో పాటు సిబ్బందిని ఆయా పోలింగ్ స్టేషన్లకు తరలించారు.