తనికెళ్లలో ఓటర్స్ స్లిప్పుల పంపిణీని పర్యవేక్షించిన జిల్లా కలెక్టర్
తనికెళ్లలో ఓటర్స్ స్లిప్పుల పంపిణీని పర్యవేక్షించిన జిల్లా కలెక్టర్
కొనిజర్ల, శోధన న్యూస్ : ఖమ్మం జిల్లా కొనిజర్ల మండలం తనికెళ్ల గ్రామంలోని ఈ నెల 30వ తేదీన జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు గాను అధికారులు ఓటర్లకు పంపిణీ చేస్తున్న ఓటర్స్ స్లిప్స్ పంపిణీ కార్యక్రమాన్ని ఖమ్మం జిల్లా కలెక్టర్ వి పి గౌతమ్ గురువారం పర్యవేక్షించారు.సార్వత్రిక ఎన్నికలకు గాను జరుగుతున్న ఓటర్స్ స్లిప్స్ పంపిణీ గ్రామంలోని ఓటర్లకు జరుగుతున్న తీరును కలెక్టర్ స్వయంగా వెళ్లి పరిరక్షించారు.ఈ సందర్భంగా మండల తాసిల్దార్ మండల అభివృద్ధి అధికారి మహాలక్ష్మికి కలెక్టర్ పలు సూచనలు ఆదేశాలు జారీ చేశారు. పకడ్బందీగా పంపిణీ జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రతి ఓటరుకు ఓటర్ స్లిప్స్ అందించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. వారి వెంట కార్యదర్శి, పలువురు అధికారులు ఉన్నారు.