తపాలా ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను అమలు చేయాలి
తపాలా ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను అమలు చేయాలి
సత్తుపల్లి , శోధన న్యూస్ : సత్తుపల్లి గ్రామీణ తపాల ఉద్యోగులు మూడు రోజులుగా తమ న్యాయమైన డిమాండ్లను అమలు చేయాలని సమ్మెను కొనసాగిస్తున్నారు ఈ సమ్మెకు సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు దండు ఆదినారాయణ సంఘీభావం తెలిపారు ఆయన మాట్లాడుతూ నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలని నిర్వేదం చేసి కార్పొరేట్ కంపెనీలకు అప్పగించే కుట్రలు చేస్తుందని దీన్ని భారత కమ్యూనిస్టు పార్టీ తీవ్రంగా ఖండిస్తుందన్నారు తపాల ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను పరిష్కారం చేయాలని ఆందోళన చేస్తూ ఉంటే వాళ్లను భయభ్రాంతులకు గురిచేసి ఇబ్బంది పెడుతున్నారని ఉద్యోగుల సమస్యల పరిష్కారం చేయకుంటే ఆందోళన ఉదృతం చేయక తప్పదని ఆయన హెచ్చరించారు. రాను నేను రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బిజెపి పార్టీని ఓడించడమే లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు కార్యక్రమంలో తపాలా ఉద్యోగుల సంఘం నాయకులు బానాల. కృష్ణ ప్రసాద్, నరసింహారావు ,వెంకటేశ్వరరావు, రామయ్య ,సలీం ,వలి ,కరీం, ప్రసాద్, గోపాలకృష్ణ పాల్గొన్నారు.