తపాలా ఉద్యోగుల సమ్మె
తపాలా ఉద్యోగుల సమ్మె
అశ్వారావుపేట, శోధన న్యూస్ :గ్రామీణ తపాల ఉద్యోగులు అపరిహ్కృతంగాఉన్న తమ డిమాండ్లు పరిష్కరించాలంటూ సమ్మెబాట పట్టారు. దీంతో మండలంలోని 17 బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్ లు మూసివేశారు. ఉత్తరాల బట్వాడా, వివిధ పొదుపు పథకాల లావాదేవీలు, ఇన్సూరెన్స్, ఉపాధి హామీ సొమ్ముల లావాదేవీలు నిలిపివేయబడ్డాయి. మండలంలోని నారంవారి గూడెం, ఊట్లపల్లి, వినాయకపురం, ఆసుపాక, అనంతారం, నారాయణపురం తదితర 17 గ్రామీణపోస్ట్ఆఫీస్ లలో సేవలు నిలిచిపోయాయి. 8 గంటల పని విధానం ప్రయోజనాలతో సహా కల్పించాలని, ఇన్సెంటివ్ విధానాన్ని రద్దుచేసి పనిభారంలోకి తీసుకోవాలని, తమ కుటుంబాలకు హెల్త్ స్కీంవర్తించేయాలనీ , మెరుగైన సేవలు అందించడం కోసంబ్రాంచ్ పోస్ట్ ఆఫీస్ లకు లాప్టాప్ లు,ప్రింటర్లు ఇవ్వాలని, గ్రాట్యూటీ అయిదు లక్షలకు పెంచాలని,12,24,36 సంవత్సరాలు పనిచేసిన వారికి సీనియారిటీ ఇంక్రిమెంట్లు ఇవ్వాలంటూ గ్రామీణ తపాలా ఉద్యోగులు సమ్మెబాట పట్టారు. ఈ కార్యక్రమంలో పలువురు తపాలా ఉద్యోగులు పాల్గొన్నారు.