తప్పులు లేకుండా దరఖాస్తులను ఎంట్రీ చేయాలి -ఖమ్మం జిల్లా అడిషనల్ కలెక్టర్ సత్య ప్రసాద్
తప్పులు లేకుండా దరఖాస్తులను ఎంట్రీ చేయాలి
-ఖమ్మం జిల్లా అడిషనల్ కలెక్టర్ సత్య ప్రసాద్
ఏన్కూరు, శోధన న్యూస్: ప్రజా పాలన దరఖాస్తులను తప్పులు లేకుండా ఆన్ లైన్ లో నమోదు చేయాలని ఖ మ్మం అడిషనల్ కలెక్టర్ సత్య ప్రసాద్ అధికారులను ఆదేశించారు.మండల కేంద్రమైన ఏన్కూరులోని మండల పరిషత్ కార్యాలయంలో మండల తహసిల్దార్ కార్యా లయంలో నిర్వహిస్తున్న అభయహస్తం దరఖాస్తుల ఆన్లైన్ ప్రక్రియను ఆయన పరిశీ లించారు.అనంతరం అడిషనల్ కలెక్టర్ సత్య ప్రసాద్ మాట్లాడుతూ.. దరఖాస్తులు ఏ ఏ పథకాలకు.. అప్లై చేసుకున్నారో ఆ వివరాలన్నీ ఆన్లైన్లో నమోదు చేయాలని ఆయన సూచించా రు.గడువులోగా..కంప్యూటరీ కరణ పూర్తి కావాలని..నమోదు అనంతరం దరఖాస్తు జాగ్రత్తగా భద్రపరచాలని ఆయన ఆదేశించారు.ఈ కార్యక్రమంలో తహసిల్దార్ శేషగి రిరావు, స్పెషల్ ఆఫీసర్ సంజయ్, ఎంపీడీవో కృష్ణ,మండల రెవెన్యూ ఆర్ ఐ.నవీన్ పంచాయతీ కార్యదర్శులు.పిల్లి శ్రీనివాసరావు, స్నేహలత తదితరులు పాల్గొన్నారు.