తహశీల్దార్ కార్యాలయం ఎదుట నిరాహార దీక్ష చేపట్టిన మహిళ
తహశీల్దార్ కార్యాలయం ఎదుట నిరాహార దీక్ష చేపట్టిన మహిళ
-కిరాణా షాప్ లో బిల్లు చెల్లించాలని డిమాండ్
అశ్వాపురం, శోధన న్యూస్ : మండల పరిధిలోని మొండికుంట గ్రామానికి చెందిన బద్దం చంద్రకళ అనే మహిళ గురువారం అశ్వాపురం తహశీల్దార్ కార్యాలయం ఎదుట నిరాహార దీక్ష చేపట్టింది. సంఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. మొండికుంట గ్రామానికి చెందిన బద్దం చంద్రకళ కిరాణా వ్యాపారం నిర్వహిస్తూ జీవనం సాగిస్తోంది. 2022లో సంభవించిన గోదావరి వరదల కారణంగా మొండికుంట కెవిఆర్ ఫంక్షన్ హాల్ లో వరద బాధితులకు పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.. ఆనాటి రెవెన్యూ అధికారులు పునరావాస కేంద్రంలో ఉన్న వారికోసం 26,800 కిరాణా సరుకులు అప్పుగా తీసుకున్నారు. పదివేల రూపాయలు చెల్లించారు. మిగతా 16,800 చెల్లించాల్సి ఉంది. నాటి నుండి నేటి వరకు కార్యాలయం చుట్టూ డబ్బుల కోసం ఆ మహిళ తిరుగుతూనే ఉంది. ఇదిగో రేపు మాపు అంటూ అధికారులు కాలయాపన చేస్తున్నారు. గురువారం కూడా డబ్బులు అడగడానికి చంద్రకళ అశ్వాపురం రెవిన్యూ కార్యాలయానికి వెళ్లింది. రెవిన్యూ అధికారు లను దురుసుగా సమాధానం రావడంతో కోపోద్రిక్తురాలైన ఆమె తాసిల్దార్ కార్యాలయం ఎదుట నిరసన దీక్షకు దిగింది. తన డబ్బులు చెల్లించే వరకు ఇక్కడ నుంచి కదిలేది లేదని బీస్ మించి కూర్చుంది. ఈ విషయం తెలుసుకున్న మొండి కుంట గ్రామపంచాయతీ సర్పంచ్ మర్రి మల్లారెడ్డి ఆ మహిళతో మాట్లాడి.. ఆ నగదు అధికారుల ద్వారా ఇప్పించేదుకు కృషి చేస్తానని,అవసరమితే తానే డబ్బులు చెల్లిస్తానని సర్పంచ్ హామీ ఇవ్వడంతో ఆమె దీక్ష విరమించింది.