తెలంగాణ

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తుమ్మల

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తుమ్మల
దమ్మపేట , శోధన న్యూస్ :  తిరుమల తిరుపతి శ్రీవారిని రాష్ట్ర మాజీ మంత్రివర్యులు, ఖమ్మం నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు శనివారం దర్శించుకున్నారు. ఆలయానికి వచ్చిన తుమ్మలకు టీటీడీ వేద పండితులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా తుమ్మల మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం అని అన్నారు. ఈ కార్యక్రమంలో తుమ్మల వెంట పలువురు కాంగ్రెస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *