తెలంగాణభద్రాద్రి కొత్తగూడెం

  తుపాన్ బాధిత రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి

  తుపాన్ బాధిత రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి
– తెలంగాణ రైతు సంఘం నాయకులు డిమాండ్
అశ్వారావుపేట, శోధన న్యూస్: ఇటీవల సంభవించిన మిచౌంగ్ తుఫాన్ తో పంట నష్టపోయిన రైతులను నూతన ప్రభుత్వం ఆదుకోవాలని,ప్రజాప్రతినిధులు క్షేత్ర స్థాయిలో తుపాను తాకిడి గురైన పంట చేలు పరిశీలించి రైతులకు భరోసా ఇవ్వాలని తెలంగాణ రైతుసంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు కొక్కెరపాటి పుల్లయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు. గురువారం ఆయన మండల పరిధిలోని తుఫాన్ తాకిడికి గురైన పలు వరి,మొక్కజొన్న,వేరుశనగ పంట చేలు ను క్షేత్రస్థాయిలోఅల్లిగూడెం, పేరాయిగూడెం,గుర్రాలచెరువు గ్రామాలలో పరిశీలించిన అనంతరం విలేకర్లతో మాట్లాడారు. వ్యవసాయ శాఖ అధికారుల లెక్కల ప్రకారమే వరి 500,వేరుశనగ 800,పత్తి 150,మొక్కజొన్న 150 ఎకరాల్లో పంటలు తుపాను తాకిడికి గురైనట్లు ప్రాధమిక అంచనాలు వేసినట్లు తెలుస్తుందని అన్నారు.ఈ పంటలు అన్నింటినీ అధికారులు క్షేత్ర స్థాయిలో పరిశీలించాలని, ప్రజాప్రతినిధులు సందర్శించి రైతులకు భరోసా ఇవ్వాలని అన్నారు.చేతికందిన పంట వొన్ను కాకపోగా లక్షల పెట్టుబడి,రైతు కుటుంబ సభ్యుల కాయకష్టం ఒక్క తుఫాన్ కొట్టుకుని పోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయి మనో వేదనలో ఉన్నారని వాపోయారు. సన్న చిన్న కారు రైతులను ఆదుకుని,ప్రత్యామ్నాయ పంటలు సాగుకు ప్రభుత్వం చేయూతను ఇవ్వాలని డిమాండ్ చేసారు. ఈ కార్యక్రమంలో నాయకులు వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు చిరంజీవి,మండల నాయకులు సొడెం ప్రసాద్,తగరం జగన్నాధం,కలపాల భద్రం లు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *