తెలంగాణలో బిజెపి అధికారంలోకి రావడం ఖాయం
తెలంగాణలో బిజెపి అధికారంలోకి రావడం ఖాయం
- బీజేపి జాతీయ కార్యదర్శి సునీల్
సత్తుపల్లి , శోధన న్యూస్ : సార్వత్రిక అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అత్యధిక సీట్లు గెలిచి అధికారంలోకి రావడం ఖాయమని బీజేపి జాతీయ కార్యదర్శి సునీల్ దియేదర్ స్పష్టం చేశారు. సత్తుపల్లి నియోజకవర్గ బీజేపి కార్యాలయంలో బుధవారం జరిగిన మేనేజ్మెంట్ కమిటీ సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాదారు. ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్ది బీజేపీ గ్రామ పెరుగుతోందని, మందకృష్ణ మాదిగ సూచనలతో మాదిగ సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు బిజెపిని గెలిపించేందుకు సిద్ధమయ్యారన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అత్యంత ప్రజాదరణ కలిగిన జనసేనతో పొ త్తు ఉండటంతో జనసేన అభిమానులు బిజెపికి మద్దతు తెలుపుతున్నారన్నారు. సత్తుపల్లి నియోజకవర్గానికి త్వరలోనే రైలు మంజూరు అవుతుందని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే సీతారామ ప్రాజెక్టు త్వరితగతిన పూర్తి చేసి ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేస్తామన్నారు. ఈ సమావేశంలో బీజేపి, జనసేన బలపర్చిన సత్తుపల్లి నియోజకవర్గ అభ్యర్థి నంబూరి రామలింగేశ్వర రావు, జిల్లా కార్యదర్శి నాయుడు రాఘవరావు, సుదర్శన్ మిశ్రా, భాస్కర్ ని వీరంరాజు తదితరులు పాల్గొన్నారు.