తెలంగాణ అమరవీరుడు శ్రీకాంతాచారికి ఘన నివాళి
తెలంగాణ అమరవీరుడు శ్రీకాంతాచారికి ఘన నివాళి
మణుగూరు, శోధన న్యూస్ : తెలంగాణ రాష్ట్రం కొరకు జరిగిన మలి ఉద్యమంలొ ప్రాణ త్యాగం చేసిన తొలి అమరజీవి శ్రీకాంతాచారి అని మణుగూరు తెలంగాణ ఉద్యమకారులు అన్నారు. ఆదివారం పట్టణంలోని తెలంగాణ చౌరస్తా లో తెలంగాణ అమరవీరుడు శ్రీకాంతాచారి వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. తొలుత శ్రీకాంతాచారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళ్ళు అర్పించారు. అనంతరం తెలంగాణ ఉద్యమకారులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధనకై శ్రీకాంతాచారి ఆత్మాహుతి చేసుకొని స్పూర్తిని నింపిన తొలి వ్యక్తి అయ్యారని అన్నారు. తెలంగాణ ఉద్యమకారులను విస్మరించిన బిఆర్ఎస్ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పిన తెలంగాణ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. మణుగూరు తెలంగాణ ఉద్యమకారులు వలసాల వెంకట రామారావు, జీవి, గాండ్ల సురేష్, అకినేపల్లీ సైదులు తదితరులు పాల్గొన్నారు.