తెలంగాణ ఆచారాలు చాలా గొప్పవి – మంత్రి తలసాని శ్రీనివాస్
తెలంగాణ ఆచారాలు చాలా గొప్పవి
– మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
హైదరాబాద్, శోధన న్యూస్: తెలంగాణ ప్రాంత సంస్కృతి,ఆచారాలు ఎంతో గొప్పవని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. బుధవారం ఎగ్జిబిషన్ గ్రౌండ్లో హరియానా గవర్నర్ బండారు దత్తాత్రేయ కుమార్తె విజయలక్ష్మి ఆధ్వర్యంలో అలయ్ బలయ్ నిర్వహించారు. వేడుకలకు మంత్రి తలసాని ముఖ్య ఆహ్వనితులుగా హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2005 సంవత్సరంలో బండారు దత్తాత్రేయ ప్రారంభించిన వేడుకలను ప్రతి సంవత్సరం నిర్వహిస్తుండటం అభినందనీయం అన్నారు.తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలను పెంపొందించే ఉద్దేశంతో వేడుకలను జరుపుతున్నారని తెలిపారు.చెడు పై మంచి సాధించిన విజయానికి నిదర్శనంగా విజయదశమి జరుపుకుంటున్న విషయాన్ని గుర్తు చేశారు.వేడుకలకు కేవలం మన రాష్ట్రానికి చెందిన వారిని మాత్రమే కాకుండా ఇతర రాష్ట్రాలకు చెందిన ప్రముఖులను కూడా ఆహ్వానించడం సంతోషకరం అన్నారు. దీని వలన తెలంగాణ సంస్కృతి గురించి వారికి కూడా తెలియజేసే అవకాశం ఉంటుందన్నారు. గ్రామీణ వాతావరణాన్ని తలపించేలా ఏర్పాట్లు, వివిధ రకాల వంటకాలను వడ్డించడం చాలా సంతోషించదగ్గ విషయం అన్నారు.