తెలంగాణహైదరాబాద్

తెలంగాణ  ప్రజలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు -సీఎం కేసీఆర్

తెలంగాణ  ప్రజలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు

-సీఎం కేసీఆర్

హైదరాబాద్, శోధన న్యూస్: తెలంగాణ పూల పండుగ బతుకమ్మ ముగింపు చివరి రోజు సద్దుల బతుకమ్మను పురస్కరించుకొని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదివారం తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ప్రజల జీవన విధానం లోనుంచి పుట్టిన ప్రకృతి పండుగే బతుకమ్మ పండుగ అన్నారు. దేవీదేవతలను అర్చించే పువ్వులే బతుకమ్మగా పూజలందుకోవడం తెలంగాణ ప్రజలకు ప్రకృతి పట్ల ఉన్న ఆరాధనను, కృతజ్ఞతాభావనను తెలియజేస్తుందన్నారు. సబ్బండ వర్గాలు సమిష్టిగా జరుపుకునే బతుకమ్మ పండుగ తెలంగాణకు మాత్రమే ప్రత్యేకమైనదని అన్నారు. పచ్చదనం, పాడి పంటలు, పశుసంపద, ప్రకృతి వనరుల సమృద్ధితో నేడు తెలంగాణ రాష్ట్రం నిండైన బతుకమ్మను తలపిస్తోందని తెలిపారు. బతుకమ్మల నిమజ్జన సమయంలో స్వీయ జాగ్రత్తలతో పాటు, ప్రభుత్వ మార్గదర్శకాలను పాటిస్తూ ఆనందోత్సాహాలతో సద్దుల బతుకమ్మను పండుగను జరుపుకోవాలని సిఎం కెసిఆర్ తెలిపారు. రాష్ట్రం సుభిక్షంగా వర్ధిల్లాలనీ సీఎం కెసిఆర్ జగన్మాత గౌరీదేవిని వేడుకున్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *